Begin typing your search above and press return to search.
బాబుకి వెన్నుపోటు ఖాయమన్న వర్మ
By: Tupaki Desk | 26 Feb 2019 4:48 AM GMTలక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య అంతకంతా పెరుగుతోంది. మాములుగా వర్మ అంటేనే ఏనాడో నమ్మకం కోల్పోయిన జనం ఇది ఇంకొకరి కథ అయ్యుంటే ఎంత పబ్లిసిటీ చేసినా పట్టించుకునే వారు కాదు. కాని విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి వివాదాస్పద కథాంశం కావడంతో ఆసక్తి అంతకంతా రెట్టింపు అవుతోంది. దానికి తోడు ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ తీసిన కథానాయకుడు మహానాయకుడు రెండూ డిజాస్టర్స్ కావడంతో వర్మ ఆనందం మాములుగా లేదు. ఇది తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.
అప్పట్లో ఎన్టీఆర్ గద్దె దిగడానికి ప్రధాన కారణంగా చెప్పుకునే బాబు వెన్నుపోటుని ఇందులో పచ్చిగా చూపిస్తాను అని వర్మ పదే పదే చెప్పడమే హైప్ పెరిగేలా చేసింది. ఇప్పుడు బాలయ్య సినిమా ఫెయిల్యూర్ నేపధ్యంలో వేగాన్ని మరింత పెంచి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా మరోసారి బాబుని టార్గెట్ చేసి ట్వీట్ వదిలిన వర్మ అందులో ఏకంగా ఎన్నికలలో టిడిపి ఓటమిని ప్రస్తావిస్తూ ఓ లాజిక్ తీయడం విశేషం.
మహానాయకుడు కల్లెక్టన్స్ చూస్తుంటే అది టిడిపి అభిమానులు కూడా చూడటం లేదని అర్థమవుతోందని బాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కినట్టు ఇప్పుడు ఆయన మద్దతుదారులు అదే పని చేసి నూటికి నూరు శాతం డబుల్ త్రిబుల్ క్లారిటీ తో తెలుస్తోందని దెప్పిపొడిచాడు.
వర్మ ఎటకారంగా అన్నా ఇందులో కొంత నిజం లేకపోలేదు. ఏ సెంటర్ లో అయినా కనీసం టిడిపి సపోర్టర్స్ మూకుమ్మడిగా చూసినా ఇంత దారుణమైన వసూళ్లు వచ్చేవి కావు. సో వాళ్ళకు ఇష్టం లేదని అర్థమైపోయింది. వర్మ చెప్పింది జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే అతను చెప్పిన మాటల్లో లాజిక్ ఉండటంతో ఇది కాస్త బాగా వైరల్ అయిపోతోంది