Begin typing your search above and press return to search.

చిన‌బాబుని 'ప‌ప్పు!' అంటూ టీజ్ చేశాడు

By:  Tupaki Desk   |   27 Oct 2019 7:47 AM GMT
చిన‌బాబుని ప‌ప్పు! అంటూ టీజ్ చేశాడు
X
క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు ట్రైల‌ర్ నేడు దీపావ‌ళి కానుక‌గా కొద్ది సేప‌టి క్రిత‌మే రిలీజైంది. ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు ఎలాంటి కుట్ర‌లు చేస్తాడు? ఎలాంటివి చేయ‌బోతున్నాడు? అన్న కోణంలో క‌థాంశాన్ని ఎంచుకుని అత‌డు ఈ సినిమాని రూపొందిస్తున్నాడ‌ని క్లియ‌ర్ క‌ట్ గా స్ప‌ష్ట‌మైంది. చంద్ర‌బాబు పైనా.. చిన‌బాబు లోకేష్ నాయుడు పైనా త‌న‌దైన శైలిలో సెటైర్ వేశాడు ఆర్జీవీ. కుట్ర‌లు కుతంత్రాల్ని రాజ‌కీయాల్ని చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ని వ‌దిలిపెట్ట‌లేదు. వ్యంగ్యంగా చాలా ర‌చ్చ చేశాడు ట్రైల‌ర్ లో.

అదంతా స‌రే.. ఇందులో నారా లోకేష్ నాయుడు పాత్ర‌ను ఆర్జీవీ ఎలా తీర్చిదిద్దారు? అన్న చ‌ర్చా ట్రైల‌ర్ చూశాక మొద‌లైంది. ఈ ట్రైల‌ర్ ఆద్యంతం హ‌త్యా రాజ‌కీయాలు అల్ల‌ర్లు గూండాయిజం అంటూ చూపించిన ఆర్జీవీ మ‌ధ్య‌లో ఓ చిన్న ఛ‌మ‌క్కును రుచి చూపించాడు. పార్టీ ఓట‌మి పాలైన త‌ర్వాతనో లేదా ఏదో ఘోర‌మైన అవ‌మానం ఎదురైన త‌ర్వాత‌నో.. చిన‌బాబు ఏడుస్తూ భోజ‌నం ప్లేట్ ముందు కూచున్నాడు. అక్క‌డికి విచారంగా వ‌చ్చిన చంద్ర‌బాబు గ‌రిటెతో ఆ కంచంలో ప‌ప్పు వ‌డ్డించాడు. అలా `ప‌ప్పు!` అంటూ చిన‌బాబును టీజ్ చేశాడు ఆర్జీవీ. ఒక‌ర‌కంగా తెర‌పై ఆ సీన్ లో ఏడ్చిన దానికంటే బ‌య‌ట చిన‌బాబును కించ‌ప‌రిచి తూట్లు పొడిచి ఏడిపించాడ‌నే చెప్పాలి.

ఒక చిన్న ట్రైల‌ర్ లో ఏపీ రాజ‌కీయాల్ని ఎంతో చ‌క్క‌గా చూపించిన ఆర్జీవీ క‌మెడియ‌న్లు క‌త్తి మ‌హేష్‌- ధ‌న్ రాజ్ లాంటి వాళ్ల‌ను సెటైరిక‌ల్ గా బాగానే వాడుకున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. వైఎస్ జగన్ సిఎమ్ కావడంతో రాష్ట్రంలో హింసా కాండ పెరిగిపోతుందని కడప రెడ్లు చెలరేగిపోతారని తేదేపా-చంద్ర‌బాబు అనుకూల ప‌త్రిక‌లు క‌థ‌నాలు వండి వార్చాయి. వాటికి ఈ ట్రైల‌ర్ పూర్తిగా కౌంట‌ర్ అనే చెప్పాలి. ఇక‌పోతే ఏపీ రాజ‌కీయాల్ని హత్యారాజ‌కీయాల్ని చూపించే క్ర‌మంలో ఆర్జీవీ విజువల్స్ క్వాలిటీని అస్స‌లు ప‌ట్టించుకున్న‌ట్టే లేదు. నాశిర‌కం విజువ‌ల్స్ ట్రైల‌ర్ చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. క‌థ‌- కంటెంట్ ని వండి వార్చ‌డంలో స్క్రీన్ ప్లేని మ‌ల‌చ‌డంలో గ్రిప్పింగ్ గా లేక‌పోతే ఆ ప‌ర్య‌వ‌సానం తీవ్రంగా ఉంటుంది. మ‌రి ఆర్జీవీ ఆ కోణంలో ఎలాంటి జాగ్ర‌త్త తీసుకున్నాడో?