Begin typing your search above and press return to search.
రామ్ గోపాల్ వర్మ.. స్కూల్ పెడుతున్నాడు
By: Tupaki Desk | 27 May 2018 9:21 AM GMTఇప్పుడు దర్శకుడిగా రామో గోపాల్ వర్మ పరిస్థితి ఎలాగైనా ఉండనీ.. గత పదేళ్ల ఆయన ట్రాక్ రికార్డు ఎంత పేలవంగా అయినా ఉండనీ.. దేశంలో అత్యధిక మందిని యువ దర్శకుల్ని ప్రభావితం చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మే అని మాత్రం అంగీకరించాల్సిందే. ప్రత్యక్షంగా పదుల సంఖ్యలో దర్శకులు తయారవడానికి కారణమైన వర్మ.. పరోక్షంగా ఇంకెంతో మందిని ప్రభావితం చేశాడు. ‘శివ’ సినిమాతో తెలుగు సినిమా మీదే కాదు.. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మీదే వర్మ చూపిన ప్రభావం అలాంటిలాంటిది కాదు. తనేమీ మాట్లాడకుండానే తన సినిమాల ద్వారా ఎంతోమందిలో స్ఫూర్తి రగిలించాడు. కృష్ణవంశీ.. తేజ.. పూరి జగన్నాథ్.. గుణశేఖర్.. ఇలా ఎంతోమంది దర్శకుల్ని తయారు చేశాడు. ఐతే ఇన్నాళ్లూ తన పనితోనే పాఠాలు చెబుతూ వచ్చిన వర్మ.. ఇప్పుడు నేరుగా గురువు అవతారం ఎత్తేయబోతున్నాడు. దర్వకత్వ పాఠాలు చెప్పబోతున్నాడు.
వర్మ త్వరలోనే ఫిలిం ఇన్ స్టిట్యూట్ మొదలు పెట్టబోతుండటం విశేషం. దాని పేరు.. ఆర్జీవీ అన్ స్కూల్ కావడం విశేషం. ఈ రోజు దాని గురించి అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. న్యూయార్క్ కు చెందిన డాక్టర్ శ్వేతా రెడ్డి.. రామ్ స్వరూప్ లతో కలిసి వర్మ ఈ స్కూల్ లాంచ్ చేస్తున్నాడు. దర్శకులు కావాలనుకునే వాళ్లను వర్మ తనదైన శైలిలో శిక్షణ ఇవ్వబోతున్నాడు. ముందే చెప్పినట్లు ఈ మధ్య వర్మ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నప్పటికీ ఆయన్నుంచి నేర్చుకోవడానికి మాత్రం చాలానే ఉంది. తాను తీసిన సినిమాలకు సంబంధించిన వివరాలన్నీ పంచుకుంటేనే అవి గొప్ప పాఠాలవుతాయి. వర్మ చెప్పే సాంకేతిక విషయాలు ఎంతో విలువైనవి. కాకపోతే వర్మ ఇప్పుడున్న స్థితిలో ఫిలిం స్కూల్ అంటుంటే.. ఇక సినిమాలు మానేసి ఇలాంటి వాటికి పరిమితం అయిపోతాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ స్కూల్ ప్రారంభం కానుంది.