Begin typing your search above and press return to search.

సత్య సినిమా వెనుక అసలు నిజాలు

By:  Tupaki Desk   |   2 July 2018 1:22 PM GMT
సత్య సినిమా వెనుక అసలు నిజాలు
X
1998 లో విడుదల అయినా సత్య సినిమా ఒక సెన్సేషన్ సృష్టించింది. కల్ట్ సినిమాలలో అగ్రస్థానం కచ్చితంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సత్య సినిమాకే ఇవ్వాలి. పెట్టిన బడ్జెట్ కి 7 రేట్లు ఎక్కువ సంపాదించి పెట్టిన సినిమా అది. ఆ సినిమా విడుదల అయ్యి ఇప్పటికి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రియల్ ట్రుథ్ బెహింద్ సత్య అని సినిమా వెనుక గల కథను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా లో షేర్ చేసారు.

మొదటగా తాను రంగీలా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి బొంబాయి వెళ్లిన తనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అని చెప్పటం మొదలు పెట్టిన వర్మ తనకు ఎప్పుడు అండర్ వరల్డ్ గొడవల్లో ఎవరు చనిపోయినా - వారి కంటే వారిని చంపిన వారి గురించే ఎక్కువ ఆలోచనలు వస్తాయి అని ఎప్పుడు గ్యాంగ్ స్టర్స్ గురించి విన్న వారు ఎప్పుడు చంపారు - ఎలా చంపారు కన్నా చంపే ముందు ఎం చేసుంటారు అన్న సందేహం నుండి పుట్టిన కథే సత్య అని చెప్పుకొచ్చారు.

సినిమాల్లో ఒక్కో క్యారెక్టర్ ఎలా పుట్టిందో అని చెప్తూ - ముంబై లో మనకు బాగానే పరిచయం ఉన్న వ్యక్తి కూడా గ్యాంగ్ స్టర్ కావచ్చు - ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది చెప్పలేని సంగతి - అలానే సత్య గురించి నిజాలు తెలీకుండా ఊర్మిళ క్యారెక్టర్ డెవలప్ చేసారని తెలియజేసాడు. అలానే మనోజ్ బాజ్ పాయి - షూరభ్ శుక్ల మరికొన్ని పత్రాలు కూడా తాను చూసిన లేక తాను విన్న వారిని మనుసులో పెట్టుకుని రాసుకున్నవే అని తెలియజేసాడు,

ఈ సినిమా అనుకోగానే తనకు బాగా పరిచయమున్న అనురాగ్ కశ్యప్ ను కలిశానని - తరువాత తన డైలాగ్స్ వల్లనే సినిమా బాగా క్లిక్ అయింది అని కితాబిచ్చాడు ఆర్జీవీ. సందీప్ చౌతా బాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది అని పొగిడాడు. అలానే అన్ని కారెక్టర్లు ఎలా ఉండాలి అనేది తనకు ముందునుండే ఒక ఆలోచన ఉందని - కానీ ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది మాత్రం కేవలం సత్య క్యారెక్టర్ ఒక్కటే అని - అలాగే ఎలా చేయాలి అని చెప్పకుండా యాక్టర్లనే వారికి తోచినట్టు చేయమన్నానని స్పష్టం చేసాడు వర్మ. టీం మొత్తానికి కృతజ్ఞతలు చెప్తూ పోస్ట్ ను ముగించాడు రామ్ గోపాల్ వర్మ.