Begin typing your search above and press return to search.
నాలుగేళ్ల నాటి షూట్.. ఇప్పుడు రచ్చేంటో
By: Tupaki Desk | 7 May 2016 11:30 AM GMTనిజంగా కొన్ని మీడియాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే.. ఒక పెద్ద సెల్రబిటీ ఏదైనా ట్వీట్ చేస్తే అదే న్యూస్ అన్నట్లు మారింది. ఓ నాలుగు రోజుల క్రితం దర్శకుడు రామ్ గోపాల వర్మ ఒక ఫోటోను ట్వీట్ చేశాడు. ఆయన అలా ట్వీటేశాడో లేదో.. ఆయన చెప్పాడని చెప్పకుండా సదరు ఫోటో గురించి చాలా పేపర్లు.. టివిల్లో.. ఇష్టం వచ్చినట్లు స్పెషల్ రైటప్ లు వేసిపాడేశారు.
ఓ నాలుగ రోజుల నుండి సూటు బూటులో.. ఎలక్ర్టిక్ గిటార్ పట్టుకొని.. వైట్ అండ్ వైట్ లుక్ లో ఇళయరాజా స్టయిల్ గా ఫోజిచ్చిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి చెక్కర్లు కొడుతోంది చూశారా? ఇక మ్యాటర్ ఏంటంటే.. జూలై 2012 లో ఆ ఫోటో షూట్ చేశాడు ప్రముఖ ఫోటోగ్రాఫర్ వెంకట్ రామ్. ఆ ఫోటోను ఇప్పుడు రామ్ గోపాల వర్మ చూసి ట్వీట్ చేస్తే.. దానినే ఇళయరాజా లేటెస్ట్ ఫోటో షూట్ అంటూ మనోళ్ళు ప్రచారం చేస్తున్నారు. సామాన్య ప్రజానీకం ఎక్సయిట్మెంట్ ను పక్కనెట్టేస్తే.. కనీసం మీడియా జనాలైనా ఈ ఫోటో ఎప్పటిది.. ఏంటి.. అసలు ఎందుకు రాజా వారు అలా సూటు వేసుకున్నారు అనే విషయాలు కాస్త రీసెర్చ్ చేసుకోవాలిగా. అబ్బే అలా చేయలేదు. అప్పట్లో ఓ మ్యాగజైన్ ఎడిటోరియల్ కోసం అలా షూట్ చేశారులే. కాని మనోళ్లు మాత్రం 1000 పాటలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజా వారు షూట్ చేయించుకున్నారని మరో రాంగ్ ప్రచారం చేస్తున్నారు.
అందుకే ఇప్పుడు ఇళయరాజా ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు. ఇది నాలుగేళ్ల నాటి షూట్ కదండీ.. సడన్ గా ఇప్పుడు దీనిని సూటు బూటులో రాజా వారు అంటూ కొత్తగా చూపిస్తున్నారేంటి అని వారు ఖంగారుపడ్డారు. కాని.. ఈ ఫోటో గురించి మొన్న రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసేసరికి ఇలా రచ్చ మొదలైందని వారికి తెలియదు పాపం.