Begin typing your search above and press return to search.
కరోనా ని టార్గెట్ చేసిన ఆర్జివి!
By: Tupaki Desk | 4 April 2020 9:10 AM GMTవివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ వివాదాలు సృష్టిస్తూ ఉంటాడు. కొందరి దృష్టిలో ఆర్జీవి తిక్కలోడైతే, మరికొందరి దృష్టిలో రాంగోపాల్ వర్మ పెద్ద జ్ఞానిలా కన్పిస్తాడు. ఎప్పుడు చూసినా కాంట్రవర్సీలకు తెరలేపుతూ ప్రకటనలు చేసే రాంగోపాల్ వర్మ ఇటీవలే ప్రాణాంతకమైన కరోనా వైరస్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించాడు. దాదాపు ప్రపంచాన్ని కుదిపేస్తూ యాభై వేలకు పైగా మనుషుల ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్ గురించి దేశాలన్నీ వణికిపోతుంటే - కొందరు సినీ దర్శక నిర్మాతలు ఈ వైరస్ పై సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారట. అందులో రాంగోపాల్ వర్మ కూడా ఒకరు.
ఇక తాజాగా రాంగోపాల్ వర్మ ఈ రోజు ఒక సంచలనమైన ట్వీట్ చేసి అందరినీ షాక్ కి గురిచేశాడు. ప్రాణాంతకమైన వైరస్ పై దాదాపు రెండు సంవత్సరాల క్రితమే పూర్తి సినిమా స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ చేసానని ఆయన ట్వీట్ చేసాడు. ఆర్జీవీ చేసిన పాత ట్వీట్ నే మళ్లీ రిపీట్ చేస్తూ.. 'నేను ముందే చెప్పాను కదా సేమ్ అదే ఇపుడు జరుగుతుంది' అన్నట్లు బిల్డప్ ఇచ్చినట్లు పోస్ట్ చేసాడు. అంతే ఈ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసి రాంగోపాల్ వర్మ ఫ్యాన్స్ అంతా ఖంగు తిన్నారు. రాంగోపాల్ వర్మ రెడీ చేసిన స్క్రిప్ట్ కి 'వైరస్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే.. ఈ వైరస్ గురించి పోస్ట్ చేసిన తర్వాత రాంగోపాల్ వర్మ మళ్లీ దానిగురించి స్పందించలేదు. ఒకవేళ మళ్లీ రాంగోపాల్ వర్మ ఈ వైరస్ కాన్సెప్ట్ గురించి చర్చించినా మనం ఆశ్చర్యపోయే అవసరం లేదనిపిస్తుంది..