Begin typing your search above and press return to search.

వర్మ అకౌంట్ మళ్లీ హ్యాక్ అయిందేమో

By:  Tupaki Desk   |   17 March 2017 1:08 PM GMT
వర్మ అకౌంట్ మళ్లీ హ్యాక్ అయిందేమో
X
రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజులుగా టాలీవుడ్ హీరోలను.. ముఖ్యంగా మెగా హీరోలను టార్గెట్ చేయడం మానేశాడు. ఖైదీ నంబర్ 150 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సమయంలో నాగబాబు కామెంట్స్.. వాటికి వర్మ కౌంటర్స్ తర్వాత ఇప్పటివరకూ మళ్లీ వారి జోలికి రాలేదు ఈ దర్శకుడు. ఇప్పుడు బాహుబలి 2 ట్రైలర్ చూసిన తర్వాత వర్మకు మళ్లీ ఊపు వచ్చినట్లుంది. వరుసగా ట్వీట్స్ పెడుతూ.. చిరంజీవి.. పవన్ కళ్యాణ్ లతో పాటు మహేష్ బాబుని కూడా తన హిట్ లిస్ట్ లో చేర్చేశాడు.

"బాహుబలి2 ట్రైలర్ ని ప్రపంచమంతా జై కొడుతున్నా.. టాలీవుడ్ మాత్రం సూపర్ సైలెంట్ ఉండడానికి కారణం.. కుళ్లు సముద్రంలో మునిగిపోవడం మూలానే".. "టాలీవుడ్ పవర్ ఫుల్ స్టార్లు నేషనల్ గా ట్రై చేసి ఘోరంగా ఫెయిల్ అయ్యి రీజనల్ అయ్యారు. ప్రభాస్ రెండు దెబ్బలతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు".. "బాహుబలి2 తర్వాత టాలీవుడ్ లో పవర్ ఫుల్లెస్ట్ మెగా సూపర్ స్టార్లు అందరికీ కూడా ప్రభాస్ కాలి గోటినందుకోవాడనికి రెండున్నర జన్మలు పడుతుంది".. "ముంబైలోని 5 అతి పెద్ద కంపెనీలు ప్రభాస్ ని మల్టిపుల్ ఫిలిమ్స్ కి సైన్ చేయించడానికి ఒకళ్లతో ఒకళ్లు దెబ్బలాడుకుంటున్నాయి".. అంటూ గురువారం ట్వీట్స్ పెట్టాడు వర్మ.

శుక్రవారం నాడు బాహుబలి2 ట్రైలర్ కి 50 మిలియన్ వ్యూస్ పోస్టర్ ను పోస్ట్ చేసి"ఈ ఫిగర్ ని చూసి టాలీవుడ్ లో ఎంతమంది ఆత్మ హత్య చేసుకుంటారో అని భయంగా ఉంది".. అంటూ ట్వీట్ చేశాడు రాంగోపాల్ వర్మ. అయితే.. అసలు విషయం ఏంటంటే.. వర్మ ఇలా తెలుగులో ట్వీట్స్ పెట్టడం అనే విషయం చాలా అరుదుగా జరుగుతుంది. మెగాస్టార్ కి సారీ చెప్పినపుడు కూడా ఇలా తెలుగులో ముందు రాసి.. తాను తెలుగులో రాయనే రాయనని.. తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారంటూ మాట మార్చేసి.. తిట్ల దండకం మొదలుపెట్టాడు. మరి ఇప్పుడు కూడా వర్మ తెలుగులో ట్వీట్స్ పెట్టాడు కాబట్టి.. మళ్లీ అకౌంట్ హ్యాక్ అయిందని మాట మార్చేసినా ఆశ్చర్యం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/