Begin typing your search above and press return to search.

కేఏపాల్ పై 'బాంబులు' వేసిన రాంగోపాల్ వర్మ

By:  Tupaki Desk   |   7 Nov 2022 5:26 AM GMT
కేఏపాల్ పై బాంబులు వేసిన రాంగోపాల్ వర్మ
X
కేఏ పాల్, రాంగోపాల్ వర్మ ఇద్దరూ ఇద్దరే.. ఒకరేమో ఫన్నీ పొలిటీషియన్.. మరొకరేమో వివాదాస్పద దర్శకుడు.. వీరిద్దరి దారులు వేరైనా ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో ఎవరికి వారే సాటి. దర్శకుడు రాంగోపాల్ వర్మ సందర్భానుసారం వేసే ట్వీట్స్, పంచులు వైరల్ అవుతుంటాయి. వివాదానికి కేంద్ర బిందువు అవుతుంటారు. తన పోస్ట్ లు సినీ, రాజకీయ నేతలకు గట్టిగా గుచ్చుకుంటాయి. ఎదుటివారు ఫీల్ అవుతారో లేరోనని వర్మ అస్సలు ఫీల్ అవ్వరు.

సమకాలీన రాజకీయాలపై స్పందించే రాంగోపాల్ వర్మ తాజాగా మరోసారి మునుగోడు ఉప ఎన్నికలపై నోరుపారేసుకున్నారు. ఈసారి కేఏ పాల్ ను టార్గెట్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్ డిపాజిట్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆయనకు 900 లోపే ఓట్లు వచ్చాయి.

అయితే కేఏ పాల్ ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేశాడు. ప్రజలతో కలిసిపోయాడు. ఎంతో ఉత్సాహంగా అన్ని ఆటలు ఆడాడు.. పాటలు పాడాడు. ఐటెం సాంగ్ లకు డ్యాన్స్ చేశాడు. రైతులా మారి పొలాల వద్దకు వెళ్లి పనిచేశారు. హోటళ్లలో దోశెలు వేశాడు. ఇంత చేసినా పాపం పాల్ కు డిపాజిట్ దక్కని వైనంపై తాజాగా రాంగోపాల్ వర్మ స్పందించాడు.

వర్మ తాజాగా కేఏ పాల్ పై సోషల్ మీడియాలో సెటైర్స్ వేశాడు. 'కేఏ పాల్.. ఐసిస్ మరియు అల్ ఖైదా లోని తన స్నేహితులను మునుగోడు నియోజకవర్గంలో బాంబులు వేయడానికి ఉపయోగిస్తున్నారని ఇప్పుడే విన్నాను. హే మునుగోడు ప్రజలారా.. త్వరగా పరిగెత్తండి' అంటూ వర్మ ఫన్నీ ట్వీట్ పోస్ట్ చేశాడు.

ఇక కేఏ పాల్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం మంచిది అంటూ మరో సలహా కూడా ఇచ్చాడు. ఇక మత ప్రబోధకుడు అయిన కేఏ పాల్ ఆ దేవుడిని ప్రార్థించి మునుగోడు ప్రజలను ఓడించినందుకు ఏదైనా చేయాలని కోరే ప్రమాదం ఉందంటూ వర్మ సెటైర్లు వేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.