Begin typing your search above and press return to search.
ఆ ఎటాక్ కంటే ఈ ఎటాక్ ఘోరం
By: Tupaki Desk | 20 Nov 2015 5:30 PM GMTసంచలనాల వర్మ మరోసారి టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయనిదే ఈయనకి నిదుర పట్టదు. సందర్భం ఏదైనా ఆ టాపిక్ రిలేటెడ్ గా ఏదైనా ఎటాక్ చేయనిదే వర్మ మనసు శాంతించదు. అప్పట్లో రాజకీయాలపైనా విసుర్లు విసిరాడు. లగడపాటి రాజగోపాల్ - చిరంజీవి - పవన్ - అమితాబ్ ... ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఆయన టార్గెట్ చేసేస్తాడు. ఆ నాలుకకు అడ్డే లేదు. అందుకే అతడిని వివాదాల వర్మ అని మనవాళ్లు పిలుచుకుంటారు.
లేటెస్టుగా వర్మ ట్విట్టర్ లో చేసిన కామెంట్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవలే ప్యారిస్ నగరంపై తీవ్రవాదులు విరుచుకుపడి అమాయక ప్రజల ప్రాణాలు తీశారు. వంద పైగా సామాన్యుల్ని పొట్టన పెట్టుకున్నారు. అలాంటివారందరికీ ఆత్మ శాంతించాలని సానుభూతి తెలియజేస్తూ ప్యారిస్ ప్రజలు దేవుడిని మొక్కారు. అయితే ఇలా దేవుడిని ప్రాధేయపడడమేంటి? నరమేధం సృష్టించిన తీవ్రవాదుల్ని చంపాలని దేవుడిని మొక్కుకో్వడమేంటి? అసలు దేవుడిని ఈ పనికి ఎలో చేయడమేంటి? అంటూ వర్మ బాధిత కుటుంబాల హృదయాల్ని తూట్లు పొడిచాడు.
ఈయన దెప్పి పొడుపులు ప్యారిస్ నే ఒణికించేసే రేంజులో ఉన్నాయి మరి. నిజమే దేవుడిపై ఎంత నమ్మకం లేకపోతే మాత్రం మరీ ఇంత సూటిగా ఏహ్యంగా మాట్లాడడమేంటి? అసలు ప్యారిస్ ఎటాక్ లో చనిపోయారు.. అన్న బాధ కంటే ఈయన ఎటాక్ కి మానసికంగా మరింతగా ప్రజలు కుంగిపోవడం ఖాయం. ఈ ట్వీట్ బాధాకరమైన విషయం. ప్రస్తుతం వర్మ వ్యవహార శైలి గురించి మరోసారి టాలీవుడ్ ప్రముఖుల్లోనూ హాట్ హాట్ గా చర్చకొచ్చింది. అదండీ .. వర్మాయణం.