Begin typing your search above and press return to search.
కే.ఏ.పాల్ ని ఇలా కూడా.. ఏమిటిది ఆర్జీవీ?
By: Tupaki Desk | 9 Dec 2019 7:01 AM GMTమతప్రభోదకుడు కే.ఏ.పాల్ వర్సెస్ ఆర్జీవీ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. పాము - ముంగిస వైరంలా ఆ ఇద్దరి మధ్యా వార్ కొనసాగుతోంది. పచ్చగడ్డి వేసినా వేయకపోయినా భగ్గుమంటోంది. గత కొంతకాలంగా ఆర్జీవీ .. పాల్ తో గిల్లికజ్జాలు ఆడుతున్నారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో పాల్ ని ఒక జోకర్ గా చూపించడమే గాక.. ఈ సినిమా పోస్టర్లు.. టీజర్.. ట్రైలర్ ప్రతిదాంట్లో పాల్ ని ఆర్జీవీ అపహాస్యం చేయడం సంచలనమైంది. మీడియా ఇంటర్వ్యూల్లోనూ కే.ఏ.పాల్ గురించి ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు హీటెక్కించాయి.
అయితే ఆర్జీవీ ఆటలు సాగకుండా కే.ఏ పాల్ కోర్టుల్ని ఆశ్రయించి చివరికి ఈ సినిమాని రిలీజ్ కానివ్వకుండా ఆపడంలో సక్సెసయ్యారు. పాల్ దెబ్బకు ఆర్జీవీకి దిమ్మ తిరిగిపోయింది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం టైటిల్ ని అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు గా మార్చడమే గాక.. ఇప్పుడు ఆ సినిమాని రెండు వారాలు ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 29న రిలీజ్ చేస్తున్నామని తేదీ ప్రకటించి సెన్సార్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 13 కి ఆర్జీవీ బృందం వాయిదా వేశారు. రివైజింగ్ కమిటీ వద్ద సమస్యను పరిష్కరించుకుని సెన్సార్ కమిటీ కటింగ్స్ కి తలొగ్గి.. ఏదోలా తంటాలు పడి ఎట్టకేలకు రిలీజ్ కి క్లియరెన్స్ తెచ్చుకున్నారు. ఇక మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజైపోతోంది. ఆ క్రమంలోనే ఆర్జీవీ మరోసారి పాల్ పై తనదైన శైలిలో పంచ్ వేశారు.
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రానికి సెన్సార్ అయ్యింది. యుఏ సర్టిఫికెట్ ని సెన్సార్ బోర్డ్ జారీ చేసింది. అయితే ఆ సర్టిఫికెట్ ని కే.ఏ.పాల్ చేతులమీదుగా ఆర్జీవీ స్వయంగా అందుకుంటున్నట్టుగా ఓ పోస్టర్ ని తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. వాస్తవానికి ఆ ఫోటో ఫేక్. అందులో పాల్ స్థానంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉండాల్సింది. ఆయన ఫోటోని మార్ఫింగ్ చేసి ఆర్జీవీ ఫోటోతో రీప్లేస్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతోంది. సరైన టైమింగ్ తో కామెడీలు చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్కోవడంలో ఆర్జీవీ తర్వాతనే. అమ్మ రాజ్యంలో కడప రెడ్లు ప్రమోషన్ కోసం ఇలా కే.ఏ.పాల్ ని ఇష్టానుసారం ఉపయోగించుకుంటున్నారు వర్మ. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఉన్న మత ప్రభోదకుడు కే.ఏ పాల్ ని ఉడికిస్తూ .. టీజ్ చేస్తూ.. విసిగిస్తూ ఆర్జీవీ తన సినిమాకి ప్రచారం చేసేసుకుంటున్నాడు. అయితే మార్ఫింగ్ నేరంపైనా ఇప్పుడు కే.ఏ.పాల్ దృష్టి సారిస్తారా? ఆర్జీవీకి కౌంటర్ ఎలా వేస్తారు? అన్నదే సర్వత్రా వేడెక్కిస్తోంది.