Begin typing your search above and press return to search.
వంగవీటి విషయంలో వర్మ డేరింగ్ డిసెషన్
By: Tupaki Desk | 28 Nov 2016 1:42 PM GMTబెదిరింపులకు.. వివాదాలకు జడిసే రకం కాదు రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమాల తీరు చూస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది. దాదాపుగా వర్మ ప్రతి సినిమా కూడా ఏదో ఒక వివాదం రాజేస్తూనే ఉంటుంది. వర్మ కొత్త సినిమా ‘వంగవీటి’ కూడా పెద్ద సంచలనమే అయ్యేట్లుంది. దాని ట్రైలర్ అంత సెన్సేషనల్ గా ఉంది మరి. అసలీ సినిమా సెన్సార్ గడప దాటి థియేటర్లలోకి వస్తుందా.. వచ్చినా థియేటర్లలో ఏ ఇబ్బందీ లేకుండా ప్రదర్శితమవుతుందా అన్న సందేహాలున్నాయి.
మరి సినిమా రిలీజ్ విషయంలో వర్మ ఎలాంటి ప్రణాళికతో ఉన్నాడో ఏమో కానీ.. ఆడియో వేడుకకు ఆయన ఎంచుకున్న వేదిక మాత్రం ఆశ్చర్యం కలిగించేదే. డిసెంబరు 3న విజయవాడలోనే ‘వంగవీటి’ ఆడియో వేడుక చేయబోతున్నట్లు ప్రకటించాడు వర్మ. ఈ సినిమా విషయంలో ఎక్కడైతే గొడవలు జరుగుతాయని భావిస్తున్నారో అక్కడే ఆడియో వేడుక చేయాలనుకోవడం సాహసమే.
‘‘విజయవాడ కుల రాజకీయాలపై నా దర్శకత్వంలో రూపొందుతోన్న `వంగవీటి` నా కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఒకటి. అప్పట్లో రౌడీ గ్యాంగులు.. హింసా రాజకీయాలకు నేను కూడా ఒక సాక్షిని. ఎప్పటి నుంచో ఈ కథను సినిమాగా రూపొందించాలనుకుంటున్నాను కానీ కుదరలేదు. దాసరి కిరణ్ కుమార్ గారి నిర్మాణంతో వంగవీటి సినిమాను ఇప్పటికీ రూపొందించగలిగాను. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్.. పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రవి శంకర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన మిగతా పాటలు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. డిసెంబర్ 3న వంగవీటి ఆడియో వేడుకను విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ మైదానంలో పలువురు ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నాం’ ’ అని వర్మ ప్రకటించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/