Begin typing your search above and press return to search.
వంగవీటి లోగో రిలీజ్ చేసేశాడు
By: Tupaki Desk | 25 Feb 2016 11:06 AM GMTసినిమాను తీస్తే తంతాం.. చంపేస్తాం.. అంటూ ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వార్నింగులు షురూ అయిన విషయం తెలిసిందే. విజయవాడకు చెందిన వంగవీటి రాధ - వంగవీటి రంగాలపై మనోడు ''వంగవీటి'' అంటూ ఒక సినిమాతో రానున్నాడు. పైగా ఇదే తన ఆఖరి తెలుగు సినిమా అని కూడా ఇప్పటికే బాగా ప్రచారం చేసుకున్నాడు. రేపు మధ్యాహ్నం విజయవాడలో కొందరు రంగా అండ్ దేవినేని బ్యాచ్ కు చెందినవారిని.. అలాగే వీరి ప్రత్యర్ధులకు.. అలాగే కొందరు ఇతర 'కాపు' సామాజిక వర్గానికి చెందిన నాయకులను మనోడు కలువనున్నాడు. ఈ సందర్భంలో తన సినిమా లోగోను రివీల్ చేయడం పెద్ద చర్చనీయాంశమైంది.
ఒకప్పుడు సదరు రాధ అండ్ రంగ.. అందరూ కమ్యూనిష్టు పార్టీకి చెందినవారే. అందుకే అనుకుంట.. రక్త సింధూరంలా పోస్టర్ అంతా రెడ్ కలర్ లోనే ఉంది. వెనుకనే ఒక ఎర్రటి జండా కూడా ఉంది. ఇకపోతే 'శివ' సినిమాలో మనోడు వాడిన సైకిల్ చైన్ సీన్.. రియల్ లైఫ్ నుండి ప్రేరణ పొందినదే అన్నట్లు.. ఈ వంగవీటి లోగోను అలా సైకిల్ చైన్ తో ఖైదు చేయడం వెనుక ఆంతర్యం ఏంటో వర్మకే తెలియాలి. దూరంగా కనిపిస్తున్న ప్రకాశం బ్యారేజీ బోర్డు కూడా కథలో కీలక భాగం అనే చెప్పాలి. ఆ వంతెన సాక్షిగా జరిగిన కొన్ని ప్రత్యర్ధి దాడులు అలాంటివి మరి. మొత్తానికి ఎవరేం చెప్పినా.. వార్నింగ్ ఇచ్చినా.. వర్మ మాత్రం తన ''వంగవీటి''తో దూసుకొస్తున్నాడు అంతే.