Begin typing your search above and press return to search.
మజిలీ మీద వర్మ వోడ్కా ట్వీట్లు
By: Tupaki Desk | 1 April 2019 10:37 AM GMTఅంతా ఆశించినట్టు చేస్తే అతను వర్మ ఎందుకు అవుతాడు. తన ఊహాతీత చర్యలతో కేవలం సోషల్ మీడియాను వేదిక మార్చుకుని సినిమాకు పబ్లిసిటీ చేసుకోవడంలో దిట్ట అయిన వర్మ కంటెంట్ తో కాదు కానీ ఈ విషయంలో మాత్రం అందరి కంటే ఓ అడుగు ముందున్నాడు. ఒకోసారి వోడ్కా కొట్టిన మత్తులో తానేం ట్వీటుతాడో తనకే తెలియని అయోమయంలో కొన్ని మెసేజులు పెట్టే వర్మ గతంలో పలుమార్లు వివాదాల్లో ఇరుక్కోవడం అందరికి గుర్తే.
లక్ష్మీస్ ఎన్టీఆర్ గొడవలో పడి కొన్నాళ్ళు దాని గురించి తప్ప ఇంక దేని మీద ట్వీట్ చేయని వర్మ తాజాగా మజిలీ ట్రైలర్ ని టార్గెట్ చేశాడు. కాని అతి కొద్దీ సమయంలోనే వాటిని డిలీట్ చేయడం అసలు ట్విస్ట్. అయితే అవి అప్పటికే లక్షల మందికి చేరిపోయి స్క్రీన్ షాట్స్ రూపంలో సేవ్ కావడంతో వర్మ కలర్స్ బయట పడ్డాయి.
మొదటి ట్వీట్ లో సమంతా లాంటి గొప్ప అందగత్తె నీకు పడిపోయిందంటే నీలో ఏదో అద్భుతమైనది ఉందని చైతుని ఉద్దేశించి అన్నాడు వర్మ. కాసేపటికే అది వోడ్కా మత్తులో పెట్టిందని సమంత కంటే తనకు చైతునే బాగా నచ్చుతాడని అలా అని తనను స్వలింగ సంపర్కులు అనుకోకండని ఇలా ఏదేదో పెట్టేశాడు. డ్యామేజ్ జరుగుతోందని గుర్తించి ఆ తర్వాత వాటిని తీసేశాడు. తన మీద ప్రత్యేకమైన అభిమానం కలిగిన అక్కినేని ఫ్యామిలీ హీరో సినిమా మీద ఇలాంటి ట్వీట్లు పెట్టడం గురించి అభిమానులు కోపంగానే ఉన్నారు. అయినా అన్ని కరెక్ట్ గా ఆలోచించి పెట్టగలిగితే అతను వర్మ ఎందుకు అవుతాడు. ఆశించిన వాళ్లదే తప్పు. అంతే