Begin typing your search above and press return to search.
'ఎన్టీఆర్' లో ఆ సీన్ కోసం వర్మ వెయిటింగ్
By: Tupaki Desk | 21 Feb 2019 10:24 AM GMTస్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ 'ఎన్టీఆర్ మహానాయకుడు' రేపు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. మరో వైపు వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ కూడా విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫెరెన్స్ లో టీడీపీ నాయకులతో మాట్లాడుతూ కొందరు ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని అడ్డుకుని ఎన్టీఆర్ గారి చరిత్రను ప్రజలకు తెలిసేలా చేయాలంటూ చంద్రబాబు పార్టీ నాయకులు సూచించడం జరిగింది. చంద్రబాబు నాయుడు తనపై ఇండైరెక్ట్ గా వేసిన పంచ్ కు వర్మ డైరెక్ట్ గానే రియాక్ట్ అయ్యాడు.
మహానాయకుడు ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసిన పోస్టర్ లో బాలకృష్ణ వెనుక రానా ఉన్నాడు. ఆ పోస్టర్ ను ట్వీట్ చేసి బాలకృష్ణను రానా ఎప్పుడు తన జేబులోంచి కత్తి తీసి పొడుస్తాడా అంటూ ఎదురు చూస్తున్నట్లుగా ట్వీట్ చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ కు భయపడి చంద్రబాబు నాయుడు ఇస్తున్న రియాక్షన్ ఇది అంటూ ఒక పోస్టర్ ను పోస్ట్ చేశాడు. ఇక మహానాయకుడు చిత్రంలోని రానా లుక్ పై వర్మ స్పందిస్తూ... చంద్రబాబు నాయుడు పాత్రలో రానా చాలా ఒరిజినల్ గా కనిపిస్తున్నాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో తాను ఉన్న వాస్తవాలను చెబుతానంటున్న వర్మ ఈ చిత్రం తీసేందుకు ఎన్టీఆర్ గారి ఇంట్లో అప్పట్లో పని చేసిన పని మనిషిని సైతం కలిసి మాట్లాడటం జరిగింది. చిన్న విషయాన్ని కూడా చాలా లోతుగా అద్యయనం చేసి మరీ ఈ చిత్రాన్ని తీశానని - ఎన్టీఆర్ కు సంబంధించి అసలైన నిజాలను ఈ చిత్రంలో చూపిస్తామని వర్మ చెబుతున్నాడు.
ఎన్టీఆర్ చరిత్రను కుట్ర పూరితంగా వక్రీకరించి చూపించబోతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వర్మ స్పందిస్తూ పోల్ పెట్టాడు. నేను చేసేది చెప్పేది నిజమా - కుట్రనా అంటూ పోల్ నిర్వహించగా వర్మకు మద్దతుగా చాలా మంది ఓటు వేశారు. మొత్తానికి వర్మ అవతలి నుండి సింగిల్ వర్డ్ వస్తే ఇక్కడ నుండి విమర్శలు వెలువెత్తిస్తున్నాడు.