Begin typing your search above and press return to search.
వర్మ భక్తుడిగా మారిన వేళ
By: Tupaki Desk | 29 Nov 2017 4:32 AM GMTరాంగోపాల్ వర్మకు దెయ్యాల మీద బోలెడంత ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ.. దేవుళ్లు అంటే మాత్రం పెద్దగా నమ్మకం లేదేమో అనిపించక మానదు. ఒకటా అరా సినిమాల్లో దేవుళ్ల రిఫరెన్సులు ఉన్నా.. రియల్ లైఫ్ లో ఈయన ట్వీట్స్-కామెంట్స్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటాయి. కానీ తాను అలనాటి అందాల తార శ్రీదేవికి కేవలం అభిమానిని కాదని.. భక్తుడినని తానే చెబుతుంటాడు వర్మ.
ఆమెపై ఎంతగా భక్తి ప్రపత్తులు కలిగిఉన్నాడో చెప్పే ఓ సాక్ష్యాన్ని వీడియో రూపంలో చూపించింది హీరోయిన్ ఛార్మి. సన్నీడియోల్ తో కలసి శ్రీదేవి ఆడిపాడిన చాల్ బాజ్ మూవీలో 'న జానే కహా సే ఆయీ ఏ లడకీ' అంటే సాగే పాటలో.. అందాల తార సూపర్బ్ గా డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను తన ఇంట్లోనే హోమ్ థియేటర్ లో వేసుకుని చూస్తున్నాడు వర్మ. పాట చూడ్డంలో వింతేమీ లేదు కానీ.. చక్కగా నేలపై కూర్చుని బుద్ధిమంతుడిలా అపర భక్తుడిలా మారిపోయి కన్నార్పకుండా చూస్తుండడమే ఇక్కడ విశేషం.
'నేల మీద కూర్చుకున్న వర్మ. శ్రీదేవి పరమ భక్తుడు ఇక్కడ. రాముఇజం అండ్ ఆయన ఫ్యానిజం' అంటూ కామెంట్ చేసి ఛార్మి పోస్ట్ చేసిన వీడియోకు బోలెడన్ని లైక్స్ వచ్చేస్తున్నాయి. వర్మకు శ్రీదేవి అంటే ఇష్టమని అందరికీ తెలుసు కానీ.. మరీ ఇంత భక్తి అనే విషయం మాత్రం ఇప్పుడే అర్ధమైంది.