Begin typing your search above and press return to search.
నాగ్ బర్త్ డేకి వర్మ అలాంటి ట్వీట్
By: Tupaki Desk | 29 Aug 2016 4:59 PM GMTట్వీట్స్ పెట్టడంలోను.. విష్ చేయడంలోను రామ్ గోపాల్ వర్మ వెరైటీ పోకడలు చూపిస్తూ ఉంటాడు. అందరూ ఓ రకంగా ఆలోచిస్తే.. ఈ డైరెక్టర్ థాట్ వేరే రకంగా ఉంటుంది. పుట్టిన రోజు లాంటి వాటిని అందరూ శుభ సందర్భాలుగా భావిస్తే.. ఈయన చావుకు దగ్గరయ్యే రోజుగా దాన్ని భావించాలని అంటాడు వర్మ. కానీ ఇప్పుడీ డైరెక్టర్ నుంచి నాగార్జున బర్త్ డేపై ఓ పాజిటివ్ ట్వీట్ పడింది.
'నేను సాధారణంగా పుట్టి రోజులకు ఎవరినీ గ్రీట్ చేయను.. విషెస్ చెప్పను. కానీ అక్కినేని నాగార్జున నాకు దర్శకుడిగా జన్మనిచ్చారు. అందుకే ఈ లిస్ట్ లో ఆయనొక్కడినీ తప్పిస్తున్నా' అంటూ నాగ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు రామ్ గోపాల్ వర్మ. నాగార్జునకు శివ లాంటి ట్రెండ్ సెట్టర్ ఇచ్చాడు వర్మ. అయితే.. అసలు ఈ సినిమాకి వర్మకు ఛాన్స్ కు ఇవ్వడమే అప్పట్లో ఒక రికార్డ్. అసలు వర్మ లాంటి కొత్త డైరెక్టర్ ని నమ్మి సినిమా చేసినందుకే నాగ్ అంతటి హిట్ అందుకోగలిగాడు.
నాగార్జున-వర్మల కాంబోలో వచ్చిన శివ సాధారణ చిత్రం కాదు. కేవలం బ్లాక్ బస్టర్.. ట్రెండ్ సెట్టర్ అనే మటాలు సరిపోవు. టాలీవుడ్ సినిమా చరిత్రను శివకు ముందు.. శివకు తర్వాత అనే గుర్తింపు వచ్చిందంటే.. ఆ సినిమా స్థాయి అర్ధమవుతుంది. అంతటి చరిత్ర సృష్టించే అవకాశాన్ని వర్మకు ఇచ్చాడు నాగ్.