Begin typing your search above and press return to search.
నానా కు మద్దతుగా నిలిచిన వర్మ..!
By: Tupaki Desk | 10 Oct 2018 10:33 AM GMTబాలీవుడ్ హీరోయిన్ తనూశ్రీ దత్తా తాజాగా జాతీయ అవార్డు గ్రహీత నానా పటేకర్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. పదేళ్ల క్రితం ఒక చిత్రం షూటింగ్ సమయంలో తనతో నానా పటేకర్ అసభ్యంగా ప్రవర్తించాడని - ఆయనో గొప్ప నటుడే అయ్యి ఉండవచ్చు - కాని మంచి వ్యక్తి కాదు అంటూ తనూశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ ను ఎంతగా కుదిపేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పదేళ్ల క్రితం విషయం ఇప్పుడు రచ్చ చేయడంతో తనూశ్రీ దారిలో మరి కొందరు కూడా తమకు ఎదురైన లైంగిక దాడుల గురించి మీటూ అంటూ మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు.
తనూశ్రీ దత్తాకు అనూహ్యంగా భారీ మద్దతు దక్కగా - నానా పటేకర్ వైపు కూడా కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విషయాల పట్ల మౌనంగా ఉంటూ వచ్చిన రామ్ గోపాల్ వర్మ మొదటి సారి సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. నానా పటేకర్ గురించి తనూశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలను ఆయన నమ్మడం లేదంటూ చెప్పుకొచ్చాడు. తాను ముంబయి వచ్చినప్పటి నుండి నానా పటేకర్ ను చూస్తున్నాను. ఆయన షార్ట్ టెంపర్ - కాని ఎవరికి బాధ పెట్టే మనిషి కాదని - ముఖ్యంగా లైంగిక వేదింపులకు పాల్పడే వ్యక్తి కానే కాదు అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.
నానా పటేకర్ కు కాస్త కోప ఎక్కువ అయినా కూడా ఆయనలో మంచి వ్యక్తి ఉన్నాడని - ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని వర్మ గుర్తు చేసుకున్నాడు. కొత్త వారిని ప్రోత్సహించడంలో ముందు ఉంటాడని నానా గురించి వర్మ కితాబిచ్చాడు. అలాంటి నానా పై తనూశ్రీ దత్తా ఆరోపణలు చేయడం వర్మకు బాధగా అనిపిస్తుందట. తనూశ్రీ దత్తా ఏమైనా పొరపాటు పడుతుందేమో అంటూ వర్మ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.