Begin typing your search above and press return to search.

రామ్... జగడం.. ఓ అమ్మాయి

By:  Tupaki Desk   |   1 Oct 2015 9:30 AM GMT
రామ్... జగడం.. ఓ అమ్మాయి
X
‘పండగ చేస్కో’ సినిమాను అందరూ రొటీన్ రొటీన్ అన్నారు. కానీ ఆ సినిమా హిట్టయింది. అంతకు ముందు రామ్ కొత్తదనం కోసం ట్రై చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టేశాయి. దీంతో ఇంకెప్పుడూ కొత్తదనం ఉన్న సినిమాలే చేయను అన్నట్లు మాట్లాడేస్తున్నాడు రామ్. ప్రేక్షకులకు ఏదిష్టమో అదివ్వడమే కథానాయకుడిగా తన బాధ్యత అని చెప్పాడు. తన కెరీర్లో ఎంతో ఇష్టపడి - కష్టపడి చేసిన జగడం సినిమాకు వచ్చిన రిజల్ట్ చూసి పడ్డ బాధ అంతా ఇంతా కాదన్నాడు. జగడం సినిమా విషయంలో ఎదురైన అనుభవం గురించి ఓ చిత్రమైన పోలిక తెచ్చాడు రామ్. అతడేమంటున్నాడో చూడండి.

‘‘ఓ అమ్మాయిని చాలా ఇష్టపడి, ప్రేమించి ఇంటికి తీసుకెళ్తే పెద్దవాళ్లు.. ‘ఈ అమ్మాయేంట్రా ఇలా ఉంది’ అని అడిగితే ఎలా ఉంటుంది? మనం ఏమైపోతాం? జగడం సినిమా ప్రేక్షకులకు నచ్చనపుడు నేను కూడా అలాగే ఫీలయ్యా. కథ నచ్చి - ప్రాణం పెట్టి చేసిన సినిమా ఫలితం ఇవ్వకపోతే ఎవరికైనా బాధే కదా. ఇప్పటికీ సుకుమార్ - నేను కలిసినపుడు ‘జగడం’ గురించే మాట్లాడుకుంటాం. ఇప్పటికీ ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం’’ అని చెప్పాడు రామ్. ఐతే కొత్తగా చేసిన కొన్ని ప్రయత్నాలు బోల్తా కొట్టడం కామన్. ఐతే కొత్తగా చేయడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయిందనుకుంటే పొరబాటే. ఫ్లాపవడానికి వేరే కారణాలుంటాయి. లోపాలు వేరే ఉంటాయి. ఐతే రామ్ మాత్రం తాను డిఫరెంటుగా ట్రై చేసిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయని చెబుతూ.. ‘పండగ చేస్కో’ దగ్గర్నుంచి రొటీన్ సినిమాలే చేస్తుండటమే విచారించాల్సిన విషయం. రామ్ కొత్త సినిమా ‘శివమ్’ కూడా రొటీన్ గానే అనిపిస్తోంది.