Begin typing your search above and press return to search.

బోయ‌పాటిని ప్ర‌శాంత్ నీల్ రేంజ్ లో ఊహించుకుంటోన్న రామ్!

By:  Tupaki Desk   |   13 July 2022 11:30 AM GMT
బోయ‌పాటిని ప్ర‌శాంత్ నీల్ రేంజ్ లో ఊహించుకుంటోన్న రామ్!
X
ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్-బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో ఓ సినిమా ఖ‌రారైన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా కేట‌గిరిలో చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే విష‌యాన్ని అధికారికంగా రివీల్ చేసారు. రామ్ పాన్ ఇండియా ఆశ‌ల‌న్ని బోయ‌పాటి పైనే పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో పాన్ ఇండియా సినిమా గురించి రామ్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. రామ్ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి పాన్ ఇండియాకి కొత్త మీనింగ్ క‌నిపిస్తుంది.

"హిందీ ప్రేక్ష‌కులు తెలుగు సినిమాలు చేసేది మ‌న త‌ర‌హా అంశాలు ఉండ‌టం వ‌ల్ల‌నే. మ‌నం అది గ‌మ‌నించ‌కుండా హిందీలో ఏం చూపిస్తున్నారో? అదే చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటాం. ప్రత్యేకంగా హిందీ మార్కెట్ కోసం మ‌నం కొత్త‌గా ఏదీ చేయాల్సిన ప‌నిలేదు. దాన్నే నేను న‌మ్ముతా. నా సినిమాల‌న్ని హిందీ అనువాద‌మ‌వుతాయి. వాటికి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది.

బోయ‌పాటి గారి సినిమాలు కూడా అంతే. ఈసారి మా ఇద్ద‌రికి పాన్ ఇండియా క‌థ కుదిరింది. ఒక హీరోని బాగా ప‌రిశోధించిన త‌ర్వాత గానీ బోయ‌పాటి సినిమా చేయ‌రు. అందుకే పాన్ ఇండియా సినిమా బాధ్య‌త‌ల‌న్ని బోయ‌పాటిపైనే వేసా" అన్నారు.

ఇక రామ్-బోయ‌పాటి ఇద్ద‌ర్ని మ్యాచ్ చేస్తే..రామ్ ఎన‌ర్జీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల‌డు. ఆ పాత్ర‌లే అంతే ఎన‌ర్జీతో ముందుకు న‌డిపించ‌గ‌ల‌డు. రామ్ ని పెద్ద స్టార్ ని చేసింది కూడా త‌న‌లో ఆ ఎన‌ర్జీనే. ఎలాంటి క‌థ‌లోనైనా రామ్ ఎన‌ర్జీ ఎక్క‌డా మిస్ అవ్వ‌దు. క‌థ‌నే ప‌రుగులు పెట్టించేంత ఎన‌ర్జీ రామ్ లో క‌నిపిస్తుంది.

అలాంటి స్టార్ కి బోయ‌పాటి లాంటి మాస్ యాక్ష‌న్ మేక‌ర్ దొరికితే స్కైలోనే ఉంటుంది. ఇక బోయ‌పాటి కథ కోసం నేల విడిచి సాము చేయ‌రు. రొటీన్ క‌థ‌నే త‌న‌దైన శైలిలో చెబుతారు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో హీరో స‌హా విల‌న్ ఎలివేష‌న్ అనేది పీక్స్ లో ఉంటుంది. రెండు పాత్ర‌ల్ని పోటాపోటీగా న‌డిపించ‌డంలో బోయ‌పాటి ని కొట్టేవారే లేరు. అది బోయ‌పాటికి మాత్రమే తెలిసిన టెక్నిక్.

అయితే రామ్ తో చేయ‌బోయేది పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి అంత‌కు మించి ఎలివేష‌న్ ఇవ్వాలి. బోయ‌పాట‌లి థాట్ ప్రాస‌స్ కూడా అలాగే ఉంటుంద‌ని గుస‌గుస వినిపిస్తుంది. 'కేజీఎఫ్' తో య‌శ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడంటే? కోలార్ గోల్డ్ ఫీల్డ్ బ్యాక్ డ్రాప్ ఒక ఎత్తైతే...రాఖీభాయ్ ని ఎలివేట్ చేసిన విధానం మ‌రో ఎత్తులో నిలిచింది. రెండింటిని ప‌క్కాగా మ్యాచ్ చేసి ఎగ్జిక్యూట్ చేసారు కాబ‌ట్టే అది సాధ్య‌మైంది.

ఇప్పుడు రామ్ కూడా బోయ‌పాటి విష‌యంలో అదే ధీమా క‌నిపిస్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య సింక్ ని ప‌క్కాగా ఎగ్జిక్యూట్ చేయ‌గ‌ల్గితే బోయ‌పాటి ఎలివేష‌న్ ని నెక్స్ట్ లెవ‌ల్ కి తీసుకెళ్ల‌గ‌ల‌రు. 'కేజీఎఫ్' విలన్ల‌ను మించి దించ‌గ‌ల స‌మ‌ర్ధుడు బోయ‌పాటి. తెలుగు సినిమానే ఎంతో గొప్ప‌గా చూపించాల‌ని బోయ‌పాటి ఎంతో త‌పిస్తుంటారు. అలాంటింది రామ్ తో పాన్ ఇండియా అంటే? బోయ‌పాటి హీరో-విల‌న్లు ఏ రేంజ్ లో ఉంటారో? ఊహ‌కు కూడా దొర‌క‌డం క‌ష్ట‌మే.