Begin typing your search above and press return to search.
రామ్ చేతికి గాయం, ప్రస్తుతం రెస్ట్
By: Tupaki Desk | 8 Aug 2015 5:28 PM GMTయువహీరో రామ్ ఇటీవలే పండగ చేస్కో చిత్రంతో హిట్టందుకుని పండగ చేసుకున్నాడు. కమర్షియల్ హిట్ లే ఎంతో విసిగిపోయిన రామ్ కి చుక్కానీలా దొరికిందీ సినిమా. హిట్టు కొట్టడమే కాదు.. రెట్టించిన ఉత్సాహంలో తాజా చిత్రాల షూటింగులు పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు శివం' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆన్ సెట్స్ ఓ ఫైటింగ్ సీన్ లో పాల్గొన్నప్పుడు ప్రమాదం సంభవించింది.
నిజానికి రామ్ చేతికి గాయమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆపద ఏమీ లేదు.. ఈ సంగతిని రామ్ స్వయంగా ట్విట్టర్ లో చెప్పాడు. గాయం వల్ల డాక్టర్లు విశ్రాంతి తీసుకోమన్నారని చెప్పాడు. ఇకపోతే రామ్ త్వరగా కోలుకోవాలని చాలామంది ఫ్యానులు మనోడి కోసం యుట్యూబ్ వీడియోల ద్వారా తమ మెసేజ్ ను పంపిస్తున్నారు. రామ్ త్వరగా కోలుకోవాలని వాళ్ళందరూ కోరుకుంటుంటే, రామ్ కూడా కాస్త త్వరగా శక్తిని కూలబడుక్కుంటున్నా అనే ఆశాభావం వ్యక్తం చేశాడులే.
రామ్ ఈ సినిమాతో పాటు కిషోర్ తుమ్మల దర్శకత్వంలో హరికథ అనే చిత్రంలో నటిస్తున్నాడు. వరుసగా కమర్షియల్ హిట్టు కొట్టేయడమే కాదు, మధ్య మధ్యలో ప్రయోగాత్మక సినిమాల్లోనూ నటించాలి. అందుకు తగ్గట్టే ప్రణాళికల్లో వేగం పెంచాడు రామ్. ప్రస్తుతం దొరికిన ప్రతి కథని వినేస్తున్నాడు. కొనేస్తున్నాడు. తెలివిగా పెట్టుబడులు పెట్టించుకుంటున్నాడు. శివం చిత్రానికి స్రవంతి రవికిషోర్ నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.