Begin typing your search above and press return to search.

పాజిటివ్ వైబ్రేష‌న్స్ ఉన్నాయి -రామ్‌

By:  Tupaki Desk   |   30 Sep 2015 7:30 PM GMT
పాజిటివ్ వైబ్రేష‌న్స్ ఉన్నాయి -రామ్‌
X
రామ్ హీరోగా స్ర‌వంతి మూవీస్ ప‌తాకంపై స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మించిన శివ‌మ్ ఈనెల 2న గాంధీ జ‌యంతి కానుక‌గా రిలీజ‌వుతోంది. శ్రీ‌నివాస‌రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రిలీజ్ సంద‌ర్భంగా సినిమా విశేషాలు చెప్పాడు రామ్‌.. అవేంటో చ‌ద‌వండి..

శివ‌మ్ ఎలా వ‌చ్చింది?

సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది. బాగా వచ్చింది. 2వ తేదీన థియేట‌ర్ ల‌లోకి వ‌స్తోంది. ప్రేక్ష‌కులంద‌రికీ బాగా నచ్చుతుంది. ఇప్ప‌టికే అన్నిచోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వినిపిస్తోంది. స‌క్సెస్ ఖాయం అని న‌మ్ముతున్నా.

విజ‌యం వ‌స్తుంద‌ని కాన్ఫిడెన్స్ ఇచ్చే పాయింట్ ఏం ఉంది?

ఇదో ఇంట్రెస్టింగ్ పాయింట్‌ తో తెర‌కెక్కిన సినిమా. క‌థాంశం టిఫిక‌ల్‌ గా ఉంటుంది. ప‌తాక స‌న్నివేశాలు మునుపెన్న‌డూ చూడ‌నంత కొత్త‌గా ఉంటాయి. ఇవ‌న్నీ విజ‌యానికి సాయ‌ప‌డ‌తాయ‌ని న‌మ్ముతున్నా.

మీ క్యారెక్ట‌రైజేష‌న్‌?

ఏదైనా డీప్‌ గా ఆలోచించే కుర్రాడు.. గ‌ట్స్ ఉన్న కుర్రాడుగా క‌నిపిస్తా. గ‌ట్స్‌ తో సమస్యల‌న్నీ ప‌రిష్క‌రించుకుంటాడు.

కొత్త ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ రెడ్డి గురించి?

కొత్త కుర్రాడైనా బాగా తెర‌కెక్కించాడు. స్క్రిప్ట్ చెప్పేటప్పుడు పేపర్ పై రాసిన‌దే తెర‌పైకి 100 శాతం పెర్ఫెక్ష‌న్‌ తో తీసుకొచ్చాడు. టెక్నిక‌ల్ టీమ్ అనుభ‌వాలు ద‌ర్శ‌కుడికి పెద్ద అస్సెట్ అయ్యాయి.

క‌థానాయిక గురించి?

రాశి ఖ‌న్నాతో అనుభ‌వం చాలా బాగుంది. బాగా కలిసిపోయాం.. అందుకే ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ కూడా చాలా బాగా వచ్చింది. మా జోడీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నా.

ప్ర‌యోగాల జోలికి వెళ్ల‌ట్లేదు ఎందుకో?

ప్ర‌యోగాలు వర్కౌట్ అవ్వలేదు. గ‌తానుభ‌వాలున్నాయ్‌. అందుకే ఇప్పుడు చేయడం లేదు. భవిష్యత్తులో నాకు ఆసక్తికరంగా అనిపించే స్క్రిప్ట్స్ వస్తే అప్పుడు ప్ర‌యోగాల‌కు వెన‌క‌డాడ‌ను.

సాంగ్స్ - లొకేష‌న్స్ గురించి చెబుతారా?

పాట‌ల‌న్నీ విజువల్ ఫీస్ట్. నార్వేలో మునుపెన్నడూ చూడని లొకేషన్స్ లో చిత్రీక‌రించాం. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌.

మ‌ల్టీస్టార‌ర్స్ చేయ‌రా?

మల్టీ స్టారర్ ల‌కు నేనెప్పుడు సిద్దమే. అయితే మంచి క‌థ‌తో ఎవ‌రైనా వ‌చ్చి ఒప్పించాలి.

‘హరికథ’ వివ‌రాలు?

చిత్రీక‌ర‌ణ ముగింపులో ఉంది.. ఔట్‌ పుట్ సూప‌ర్భ్‌.

30 ఏళ్ల స్ర‌వంతి మూవీస్ గురించి, పెద‌నాన్న‌గారి గురించి?

పెద‌నాన్న తొలి నుంచి నాతోనే ఉంటూ సపోర్ట్ ఇచ్చారు, భవిష్యత్తులోనూ ఆయ‌న ఉండాల్సిందే. 30 ఏళ్ళ నుంచి స్ర‌వంతి మూవీస్ సినిమాలు తీస్తూనే ఉంది. పెద‌నాన్న గ‌ట్స్ ఉన్న నిర్మాత‌. అందువ‌ల్లే ఇప్పుడు సినిమాలు తీయ‌గ‌లుగుతున్నారు.