Begin typing your search above and press return to search.
'చిరంజీవి' అని పిలిచారా! ఫైట్ మాస్టర్స్ కి ఎన్ని గుండెలు?
By: Tupaki Desk | 23 July 2020 7:50 AM GMTఫైట్ మాస్టర్స్ రామ్ -లక్షణ్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ కవలసోదరుల్లో ఎవరు ఎవరో చెప్పడం చాలా కష్టం. ఒకే డ్రెస్.. ఒకే హెయిర్ కట్.. ఒకే లుక్. కనిపెట్టడమే కష్టం. రామ్ -లక్ష్మణ్ గురించి సన్నిహితంగా తెలిసిన వారు మాత్రమే వెంటనే గుర్తు పట్టగలరు. కొన్నాళ్లు పని చేశాక గుర్తించే ఛాన్సుంటుందేమో!!
ఈ ఇద్దరూ పరిశ్రమకు రాకముందు మేకలు గేదెలు కాసారట. ఒకరు మేకలు కాస్తే ఇంకొకరు గేదెలు కాసేవారు. పల్లెటూళ్లో ఉపాధి లేక తిండికి లేక నానా ఇబ్బందులు పడేవారు. అయితే పొరుగు ఊళ్లో రాజు మాస్టార్ తమ తండ్రిగారికి తెలుసు. అలా ఆయన వద్ద అసిస్టెన్సీ కోసం ఆర్నెళ్లు ప్రయత్నించారట. చివరికి ఏదోలా ఛాన్స్ దక్కింది. అలా సర్కార్ ఎక్స్ ప్రెస్ ఎక్కి ఇండస్ట్రీకి వచ్చారు. చదువు సాము లేదు. అయినా ఇండస్ట్రీలో మాత్రం టాప్ ఫైట్ మాస్టర్లుగా ఎదగడం వెనక రాజు మాస్టార్ ఇచ్చిన ట్రైనింగ్ సహకరించిందట. ఆ విషయాలన్నీ వారు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కుటుంబ నేపథ్యం లేకుండానే చిత్రపరిశ్రమలో ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎదిగిన కవలలు వీళ్లు. 18 వయసు వరకూ ఊళ్లో వ్యవసాయం గేదెలు మేకలు కాసే పని. ఇప్పుడు వీళ్ల ను టచ్ చేయలేని స్థాయికి ఎదిగారు. అయినా ఇంకా ఒదిగి ఉండడం ఎదుటివారిని గౌరవించి మాట్లాడడం ఇవన్నీ పరిశ్రమే నేర్పిందట. వీరికి ఊళ్లో ఒక కొండ రాయి గురువు అట. అది ఎత్తి హీరోలు అయ్యారట. జీవితంలో ఎలా ఉండాలి? ఎలా ఎదగాలి? ఎలా నడుచుకోవాలి? ఎలా తినాలి? ఎలా మాట్లాడాలి? ఇవన్నీ రాజు మాస్టర్ నేర్పించారని తెలిపారు. చివరికి తిండి ఎలా తినాలో కూడా రాజు మాస్టారే నేర్పించారట.
మాట తీరు అంటే వీళ్లు ఆరంభంలో `చిరంజీవి` అని సింగులర్ లో పిలిచేసేవారట. త్రినేత్రుడు సెట్స్ లో చిరంజీవిని చూశారట. బయట ఎలా మామూలుగా మాట్లాడతామో అలానే అక్కడా మాట్లాడేసేవారిమని.. అయితే రాజు మాస్టార్ గట్టిగా కొట్టి ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో నేర్పించారని తెలిపారు. ``చిరంజీవి అని పిలుస్తారేంటిరా.. చిరంజీవి గారు లేదా అన్నయ్య గారు అని పిలవాలి`` అని రాజు మాస్టార్ చెప్పారట. ఆ తర్వాత అలా కంటిన్యూ అయ్యారట. ఇప్పుడు చిరంజీవి మెచ్చే టాప్ ఫైట్ మాస్టార్స్ ఎవరు? అంటే రామ్ - లక్ష్మణ్ మాస్టార్లే. వీళ్లు లేనిదే మెగా కాంపౌండ్ సినిమాలే లేవు మరి. అంత గౌరవం గుర్తింపు వారి సొంతమైంది.