Begin typing your search above and press return to search.
ఖైదీ నెం.150 ఫైట్ మాస్టర్ల మంచితనం
By: Tupaki Desk | 14 Sep 2016 5:04 AM GMTఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ లు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ మూవీ ఖైదీ నెంబర్ 150కి ఫైట్స్ అందిస్తున్నారు. అన్నయ్యకు ఫైట్ మాస్టర్స్ గా పని చేయలేమేమో అనే బెంగను.. ఈ సినిమాతో తీర్చేసుకుంటున్నారు ఈ కవలలు. అయితే.. వీరికి సినీరంగంలోకి వచ్చినప్పటి నుంచి సమాజసేవ అంటే చాలా మక్కువ. సేవ అంటే వేరే ఏమీ కాదు.. తోచినంతలో సాయం చేస్తూ ఉంటారంతే.
లేటెస్టుగా ఇబ్రహీపట్నం (రామోజీ ఫిలింసిటీకి వెళ్ళే దారిలో ఉన్న గ్రామం) ఉన్న స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ కు లక్ష రూపాయల విరాళం అందించారు రామ్ లక్ష్మణ్ లు. 'రెండు నెలల క్రితం ఓ షూటింగ్ కోసం ఇటు నుంచి వెళుతున్నపుడు ఈ ఫౌండేషన్ బోర్డ్ చూసాం. అంధ బాలబాలికలకు ఈ ఫౌండేషన్ సాయం చేస్తోందని తెలిసి.. వారిని ఆఫీస్ కి వెళ్లి కలిశాము. వారి కార్యకలాపాల గురించి తెలుసుకున్న తర్వాత మేము కూడా ఎంతో కొంత సాయం చేయాలని అనిపించింది. అందుకే మా అన్నదమ్ముల తరఫు నుంచి లక్ష రూపాయలు ఇస్తున్నాం. మాకు ఎంతో సంతోషంగా ఉంది' అని చెప్పారు వీరిద్దరూ.
లక్ష ఇచ్చేసి చేతులు దులిపేసుకోబోమని.. భవిష్యత్తులో కూడా చేతనైనంత సాయం చేస్తూనే ఉంటామని చెబుతున్నారు రామ్ లక్ష్మణ్ లు. ఇలాటి సాయాలు వీరికి కొత్త కాదు.. ఇప్పటికే చాలామందికి వీరే స్ఫూర్తిగా నిలుస్తున్నారు కూడా.