Begin typing your search above and press return to search.
ఆ స్టార్స్ ఇద్దరూ బాలయ్య సినిమాకు టాటా చెప్పారా..?
By: Tupaki Desk | 4 March 2021 11:30 AM GMTటాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లలో ఒకటి నందమూరి బాలకృష్ణ - బోయపాటి శీను కాంబో. వీరి కాంబోలో సినిమా వస్తుందంటేనే నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజిలో సందడి చేస్తారు. అంటే 2014లో వచ్చిన లెజెండ్ సినిమా తర్వాత.. దాదాపు ఏడేళ్లకు ఈ కాంబినేషన్ మళ్లీ సందడి చేయడానికి సిద్ధమవుతోంది. బాలయ్య ప్లాప్ లలో ఉన్నప్పుడల్లా బోయపాటి బ్లాక్ బస్టర్ ఇచ్చి సేవ్ చేసాడు. ప్రస్తుతం బాలయ్య వరుస ప్లాప్ లను ఎదుర్కొంటున్నాడు. కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ ఇలా మొన్నటివరకు ప్లాప్స్ ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఎలాంటి కమర్షియల్ సినిమా అయినా బాలయ్య సినిమాలలో అదిరిపోయే డైలాగులతో అంతకుమించిన భారీ ఫైట్ సీక్వెన్సులు ఉంటాయి. ప్రస్తుతం అలాంటి మాస్ ఫైట్ సీక్వెన్స్ లకు బ్రేక్ పడిందని ఇండస్ట్రీ టాక్.
ఏంటంటే.. తెలుగులో స్టార్ ఫైట్ మాస్టర్స్ అంటే రామ్-లక్ష్మణ్ అనే సంగతి అందరికి తెలిసిందే. మాస్ సినిమాలలో మాస్ ఫైట్స్ అన్ని దాదాపుగా వీరిద్దరే కంపోజ్ చేస్తారు. అలాగే ట్రెండ్ దృష్టిలో పెట్టుకొని కూడా. అయితే బోయపాటి బాలయ్య సినిమా అంటే ఫైట్స్ ఎలా ఉంటాయో అభిమానులకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు తెరకెక్కుతున్న బిబి3లో కూడా అలాంటి ఫైట్స్ ఎక్సపెక్ట్ చేస్తారు. అయితే ఇటీవల డైరెక్టర్ బోయపాటికి రామ్ లక్ష్మణ్ లకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని పుకార్లు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమా నుండి రామ్ లక్ష్మణ్ తప్పుకున్నట్లు సమాచారం. మరి ఎందుకు అసలు ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉండగా.. వారి స్థానంలో స్టన్ శివ లైన్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా మే 28న థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.