Begin typing your search above and press return to search.
మహేష్ తో ఫైట్ చేయించేది ఆ ఇద్దరే!
By: Tupaki Desk | 25 Jun 2019 4:33 AM GMTవచ్చే నెల మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు గురించి నిన్న మీడియాలో ఓ ప్రచారం జరిగింది. వార్ ఎపిసోడ్ కోసం విదేశీ ఫైటర్లను తీసుకొచ్చారని దాని కోసం ప్రిన్స్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడని దాని సారాంశం. అయితే దర్శకుడు అనిల్ అనిల్ రావిపూడి మాత్రం అవేవి లేవని చెబుతున్నాడు. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ లే దీనికి వర్క్ చేస్తారని మహేష్ కి ప్రత్యేకంగా ట్రైనింగ్ లాంటివి ఏవి అవసరం లేదని తేల్చి చెప్పాడట.
కాశ్మీర్ వెళ్ళాక అక్కడ జాయిన్ అయ్యే ఆర్టిస్టులకు ఓ నాలుగు రోజుల వర్క్ షాప్ కండక్ట్ చేయడం మినహాయించి మిగిలినదంతా యథావిధిగా మాములుగానే కొనసాగుతుందని చెబుతున్నాడు. సో అందరూ అనుకున్నట్టు ఇటలీ నుంచి ఎలాంటి టీమ్ రాలేదన్న మాట. కాశ్మీర్ వెళ్ళాక శ్రీనగర్ తో పాటు సోనా మార్గ్ లాంటి ప్రాంతాల్లో ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు యుద్ధానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు.
ఇది అయ్యాక ఓ ఇరవై రోజులు హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేశాక అక్కడ నుంచి టీమ్ రాయలసీమకు బయలుదేరే ప్లానింగ్ తో ఉన్నట్టు తెలిసింది. మిలిటరీ ఆఫీసర్ కి సీమతో ఏం పని అనే పాయింట్ మీద రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. మహర్షి ఇచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మహేష్ కన్ను ఇప్పుడు హ్యాట్రిక్ మీద ఉంది. వరసగా మూడోసారి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించడం మరో ఆకర్షణగా నిలుస్తోంది