Begin typing your search above and press return to search.

మరో ఇస్మార్ట్ కావాలంటున్న రామ్?!

By:  Tupaki Desk   |   5 Sept 2019 12:19 PM IST
మరో ఇస్మార్ట్ కావాలంటున్న రామ్?!
X
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు 'ఇస్మార్ట్ శంకర్' విజయం ఇచ్చిన జోష్ అంతా ఇంతా కాదు. డెబ్యూ సినిమా 'దేవదాసు' తోనే సూపర్ హిట్ సాధించి.. 'రెడీ' లాంటి బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో ఉన్నప్పటికీ నెక్స్ట్ లీగ్ లోకి చేరడంలో రామ్ తడబడుతూనే ఉన్నాడు. ఒక్క 'నేను శైలజ' తప్ప గత కొన్నేళ్లలో రామ్ సినిమాలన్నీ నిరాశ పరిచినవే. ఇలాంటి సమయంలో పూరి జగన్నాధ్ 'ఇస్మార్ట్ శంకర్' కోసం ఇచ్చిన మేకోవర్.. రామ్ లోని టాలెంట్ ను ఒక్కసారిగా అందరికీ మరోసారి గుర్తు చేసింది. రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ గా నిలవడంతో ఒక్కసారిగా రామ్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులు ఎలాంటివి ఎంచుకోవాలి.. ఎలాంటి సినిమాలు చేయలనిఅనే విషయంలో ఆలోచనలు మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది.

అయితే ఈ మార్పు డైరెక్టర్ కిషోర్ తిరుమలకు చీకాకులు తెచ్చిపెడుతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రామ్ - కిషోర్ తిరుమల కాంబోలో ఒక సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయనే విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా 'ఇస్మార్ట్ శంకర్' కంటే ముందే తెరకెక్కుతుందని అన్నారు కానీ డిలే అయింది. ఇప్పుడు 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ గా నిలవడంతో రామ్ ఈ సినిమాకు మార్పు చేర్పులు సూచిస్తున్నాడట. మాస్ ఎలిమెంట్స్ ఉండాలని.. ఊరమాస్ పంచ్ లు ఉండాలని.. డబల్ షేడ్స్ ఉండే క్యారెక్టర్ లో ఒకటి ఫుల్ మాస్ వైపు టర్న్ చేస్తే బాగుంటుందని సూచనలతో కిషోర్ తిరుమల కథకు ఇస్మార్ట్ టచ్ ఇస్తున్నాడని అంటున్నారు.

అయితే ఇక్కడ చిక్కేంటంటే.. కిషోర్ తిరుమల సాఫ్ట్ డైరెక్టర్. మాస్ మసాలా టైపు కాదు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఏవి చూసినా మనకు అది అర్థం అవుతుంది. అసలు మాస్ అంటే తెలియని డైరెక్టర్ సినిమాకు ఊరమాసు ఇస్మార్ట్ టచ్ ఇస్తే ఏమవుతుందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. రామ్ ఆలోచనలను ఇలా మాసుగా మార్చేసిన పూరి మాత్రం హాయిగా 'ఫైటర్' అంటూ బిజీగా ఉన్నాడు. కానీ ఆయన ప్రభావం ఇక్కడ కిషోర్ పై పడుతోంది. మరి ఇది ఎలా టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.