Begin typing your search above and press return to search.

వారియర్ ను ముగించేసిన ఉస్తాద్..!

By:  Tupaki Desk   |   28 May 2022 3:32 PM GMT
వారియర్ ను ముగించేసిన ఉస్తాద్..!
X
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న ఫస్ట్ బైలింగ్విల్ మూవీ ''ది వారియర్''. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్య పాత్రలో రామ్ కనిపించనున్నారు. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'ది వారియర్' మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ టీజర్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోయింది. ఇదే క్రమంలో వచ్చిన 'బుల్లెట్' సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అయితే తాజాగా 'ది వారియర్' సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నెల రోజుల బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని ప్రకటించారు. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ఇంట్రడక్షన్ సీక్వెన్స్ షూట్ చేయడంతో చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రామ్ పోతినేని అభిమానులను ఉత్సాహపరిచేందుకు చిత్ర యూనిట్ 'ది వారియర్' నుంచి కొత్త పోస్టర్ ను పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ఆల్రెడీ విడుదలైన టీజర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ పరంగా, టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉందని అందరూ అంటున్నారు అని చెప్పారు.

''ఈ రోజుతో సినిమా షూటింగ్ పూర్తయింది. గత వారం రోజులుగా మా హీరో రామ్ పై ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేశాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు - 100 మంది మోడల్స్ తో తెరకెక్కించాం. దీంతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు ప్రారంభించాం''

''బుల్లెట్ సాంగ్ తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ పాట అందరి నోటా వినబడుతోంది. అందులో రామ్ - కృతి శెట్టి వేసిన స్టెప్స్ వేస్తూ యంగ్ స్టర్స్ రీల్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆ పాటకు 55 మిలియన్ వ్యూస్ రావడం సంతోషంగా ఉంది. త్వరలో మిగతా పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని నిర్మాత తెలిపారు.

'ది వారియర్' చిత్రాన్ని జూలై 14న తెలుగు తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

ఇందులో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అక్షర గౌడ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. నదియా - నాజర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డి.వై. సత్యనారాయణ ఆర్ట్ డైరక్టర్. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్న ఈ సినిమాకి అన్బు అరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

'ది వారియర్' అనేది రామ్ కెరీర్ లో 19వ చిత్రం.. తమిళ డెబ్యూ మూవీ. మరి ఈ ద్విభాషా చిత్రం మన రాపోకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. ఇకపోతే దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ పాన్ ఇండియా యాక్షన్ ఫిలిం చేయనున్నారు.