Begin typing your search above and press return to search.
`నేను శైలజ` కాంబో మళ్లీ!
By: Tupaki Desk | 29 Sep 2016 1:30 AM GMTఫ్లాప్ దర్శకులనే నమ్మి అవకాశమివ్వగా లేనిది... తనకే ఓ మంచి హిట్టిచ్చిన దర్శకుడికి రామ్ మరో అవకాశమివ్వడా? కథ కాస్త అటు ఇటుగా అనిపించినా అవకాశమిచ్చి తీరతాడు. కానీ రామ్‌కోసం `నేను శైలజ` దర్శకుడు కిషోర్ తిరుమల మరో అదిరిపోయే స్క్రిప్టు తయారు చేశాడట. అది నచ్చడంతో `తప్పకుండా మనం చేద్దాం` అని చెప్పేశాడట రామ్. అది కూడా హోమ్ బ్యానర్‌లోనే చేయబోతున్నాడట. ఆ విషయాన్ని రామ్ స్వయంగా వెల్లడించాడు. `హైపర్` ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ రామ్ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చాడు. తనతో `ఎందుకంటే ప్రేమంట` చిత్రాన్ని తీసిన కరుణాకరన్ తోనూ మరో సినిమా చేసే ఆలోచనలున్నాయని రామ్ తెలిపాడు.
ఆ చిత్రం ఫ్లాపైనప్పటికీ రామ్ మాత్రం కరుణాకరన్ పై నమ్మకంగా ఉన్నాడు. అలాగే కిషోర్ తిరుమలతోనూ మరో సినిమా చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం వెంకటేష్‌తో సినిమా చేసే పనుల్లో ఉన్నాడు కిషోర్ తిరుమల. ఆ సినిమా పూర్తయిన వెంటనే మా ప్రాజెక్టు ఉండొచ్చని రామ్ తెలిపాడు. మరి కిషోర్ తిరుమల `నేను శైలజ`లాంటి విభిన్నమైన స్క్రిప్టే తయారు చేశాడా లేదంటే ఈసారి రామ్ స్టైల్‌లోనే సినిమా తెరకెక్కించనున్నాడా అనేది చూడాలి.