Begin typing your search above and press return to search.

రామ్ టీ ష‌ర్టు భ‌లే ఉందే!

By:  Tupaki Desk   |   20 Feb 2016 5:44 AM GMT
రామ్ టీ ష‌ర్టు భ‌లే ఉందే!
X
ఐ ల‌వ్ యు... బ‌ట్ ఐ యామ్ నాట్ ఇన్ ల‌వ్ విత్ యు... ! - రామ్ ఇటీవ‌ల న‌టించిన కొత్త సినిమా `నేను శైల‌జ`లోని ఈక్వేష‌న్ ఇది. ఈ డైలాగ్ విన‌గానే `అరే ఇదేం లెక్క‌` అనుకుంటూనే... ఇందులో ఏదో మేజిక్ ఉన్న‌ట్టుంది, చూడాలి అని ఫిక్స‌య్యారు ప్రేక్ష‌కులు. అనుకున్న‌ట్టుగానే కొత్త యేడాది తొలి రోజునే వ‌చ్చిన నేను శైల‌జ‌ని ఇర‌గ‌బ‌డి చూశారు. తెర‌పై మేజిక్ కూడా వ‌ర్క‌వుట్ అవ్వ‌డంతో బొమ్మ సూప‌ర్‌ హిట్ట‌య్యింది. కొంత‌కాలంగా స‌రైన విజ‌యాల్లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రామ్ ఇప్పుడు సూప‌ర్‌ హ్యాపీస్ అన్న‌మాట‌. వెంట‌నే కొత్త సినిమా చేస్తే కిక్కు పోద్ది అనుకొన్నాడో ఏంటో... ఇంకా నేను శైల‌జ స‌క్సెస్‌ ని ఆస్వాదిస్తూనే ఉన్నాడు రామ్‌.

ఇప్ప‌టికీ ఆయ‌న్నుంచి కొత్త సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న రానే లేదు. ఇటీవ‌లే నేను శైల‌జ యాభై రోజుల వేడుక జ‌రుపుకుంది. ఆ విష‌యాన్ని గుర్తు చేస్తూ అంద‌రికీ థ్యాంక్స్ చెబుతున్నాడు రామ్‌. మీకు మా సినిమా న‌చ్చింది, మాకు మీ రెస్పాన్స్ అంత‌కంటే న‌చ్చిందంటూ ఓ ట్వీట్ కూడా చేశాడు. విజ‌యానందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్న రామ్‌ కి త‌న సోద‌రుడు తాజాగా మ‌రో స్వీట్ గిఫ్ట్ అందించాడు. నేను శైల‌జ‌లోని డైలాగ్‌ ని రాసి వున్న టీష‌ర్టే ఆ స్వీట్ గిఫ్ట్‌. ఆ ష‌ర్ట్‌ ని వేసుకొన్న రామ్ ఓ సెల్ఫీని తీసుకొని ట్విట్ట‌ర్‌ లో పెట్టేశాడు. ఇక రామ్‌ లాంటి కుర్ర హీరోలు ఇలాంటి టీ ష‌ర్టు వేసుకొని చూపించాక‌... ఈ కొటేష‌న్స్‌ తో బ‌య‌టికి టీ ష‌ర్టులు రాక‌పోతాయా ఏంటి? సో రామ్ టీ ష‌ర్టులు ధ‌రించ‌డానికి సిద్ధ‌మైపోండిక‌!