Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: న్యూ ఇయర్‌ కి న్యూ రామ్

By:  Tupaki Desk   |   21 Dec 2015 4:58 PM GMT
ట్రైలర్ టాక్: న్యూ ఇయర్‌ కి న్యూ రామ్
X
ఎనర్జిటిక్ హీరో రామ్ - కీర్తి సురేష్ జంటగా నటించిన నేను.. శైలజ.. మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంఛ్ చేశారు. ఓ క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ తీస్తున్నానని ముందే చెప్పిన రామ్.. అలా ఎందుకు చెప్పాడో ట్రైలర్ చూశాక పక్కాగా అర్ధమవుతుంది. మరోవైపు ఎలాంటి మసాలాలు కోరుకోవద్దని చెప్పాడు కానీ.. సాధారణ మాటలనే తన స్టైల్ తో పంచ్ లుగా మార్చేశాడు రామ్.

ట్రైలర్ మొదలుపెట్టడమే.. "స్నేహం అనేది విశాఖపట్నం సముద్రం లాంటిది, ప్రశాంతంగా ఉంటది.. 'మరి లవ్వో'.. హుధూద్ లాంటిది" అంటూ కౌంటర్ వేసేశాడు రామ్. అమ్మాయి యావరేజ్ గా ఉంటేనే ఏంజెల్ లా ఫీలవుతాం.. అదే మరి ఏంజెల్ లా ఉంటే.. అంటూ సాధారణ కుర్రాళ్ల మనసులో ఆలోచనలను సున్నింతగా ప్రజెంట్ చేశాడు. నాలాంటోడిని తాగుతావా అని అడగక్కర్లా, జస్ట్ మనసులో అనుకుంటే చాలు.. అంటూ కేరక్టర్ ని కూడా పరిచయం చేసేశాడు. ఇక టెన్త్ నుంచిడిగ్రీ వరకు అన్ని పరీక్షలు ఫెయిల్ లాంటి డైలాగ్స్ అయితే.. ఓ అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడిని కరెక్ట్ గా తెలియచేస్తాయి. ట్రైలర్ మొత్తంలో హీరోయిన్ కీర్తి సురేష్ కి ఉన్నది ఒకే డైలాగ్. "ఐలవ్యూ.. బట్ ఐయామ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ" అంటుంది కీర్తి. ఈ డైలాగ్ విన్నాక.. రామ్ క్వశ్చన్ మార్క్ ఫేస్ అయితే సూపర్బ్ ఎక్స్ ప్రెషన్ అనాల్సిందే. చివర్లో లవ్ లో ఫెయిలయితే.. గడ్డం పెంచకుండా.. జిమ్ కెళ్లి సిక్స్ ప్యాక్ చేయమంటావా అంటూ ఫినిష్ చేస్తాడు రామ్.

ట్రైలర్ లో కామెడీ పంచ్ లు బాగానే పేలాయి. ఫ్యామిలీ మూవీ అనే ఇండికేషన్ ఇచ్చారు. విజువల్స్ నుంచి దేవిశ్రీ మ్యూజిక్ వరకూ అన్నీ సూపర్బ్ గా ఉన్నాయి. ఎక్కడా హడావిడి లేకుండా.. స్వీట్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ చూస్తున్న ఫీల్ కలిగించాడు డైరెక్టర్ కిషోర్. చూస్తుంటే.. ఈసారి కుర్రాడు సక్సెస్ కొట్టేట్టే ఉన్నాడు.