Begin typing your search above and press return to search.

మాస్ డైరెక్టర్ తో రామ్ కొత్త సినిమా..!

By:  Tupaki Desk   |   20 March 2021 11:35 AM GMT
మాస్ డైరెక్టర్ తో రామ్ కొత్త సినిమా..!
X
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తదుపరి సినిమాల విషయంలో స్పీడ్ పెంచుతున్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే తమిళ డైరెక్టర్ లింగుస్వామితో సినిమా ఫిక్స్ అయినప్పుడే షూట్ లో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నాడు. వచ్చేనెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం చేయనున్నారట. మాస్ కంటెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని రామ్ తెగట్రై చేస్తున్నాడు. కొన్నేళ్లుగా రామ్ కమర్షియల్ హీరోగా సెటిల్ అవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ నుండి మాస్ కథలకోసమే ఎదురుచూసి లింగుస్వామి కథను ఓకే చేసాడు రామ్. చివరగా చేసిన రెడ్ సినిమా కూడా మాస్ కంటెంట్ తోనే తెరకెక్కింది. ఎలాగోలా మొత్తానికి ఈ ఏడాది రెడ్ తో మోస్తారు హిట్ అందుకున్నాడు రామ్.

ప్రస్తుతం లింగుస్వామి సినిమా కోసం తనను తను సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ కృతిశెట్టి కన్ఫర్మ్ అయింది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్నాడు. ఇదిలా ఉండగా.. రామ్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ సినిమా చేయనున్నాడట. ఇటీవలే బోయపాటి చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసినట్లు ఇండస్ట్రీ టాక్. అసలే మాస్ ఫేమ్ కోసం రామ్ ఎదురుచూస్తున్నాడు. ఇలాంటి టైంలో బోయపాటితో సినిమా అంటే ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. ప్రస్తుతం బోయపాటి బాలయ్యతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా మేలో రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా తర్వాత రామ్ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాను బిబి3 ఫేమ్ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తారని సమాచారం.