Begin typing your search above and press return to search.

ఫెయిలైతే బాధగానే ఉంటుందిలే

By:  Tupaki Desk   |   25 Oct 2017 4:38 PM GMT
ఫెయిలైతే బాధగానే ఉంటుందిలే
X
సినీ ఇండస్ట్రిలో కథలకు చాలా మంది హీరోలతో పెళ్లి చూపులు జరుగుతాయి. కానీ పెళ్లి మాత్రం ఒక్కరితోనే జరుగుతోంది. కొన్ని కథలైతే పెళ్లిపీటల దగ్గరికి వచ్చిన తరువాత పెళ్లి చెడిపోయినట్టు సెట్స్ పైకి వెళ్లాక కూడా సినిమా ఆగిపోవడంతో.. వేరొకరి దగ్గరకు వెళ్ళిపోతాయ్. దీంతో కథ వేరొక హీరోని వెతుక్కోక తప్పదు. ఇలాంటీ పరిణామాలు ప్రతి ఇండస్ట్రీలో చాలా జరుగుతూనే ఉంటాయి.

అయితే తాను కూడా కొన్ని హిట్టు కథలని వదిలేసుకోవాల్సి వచ్చిందని యంగ్ హీరో రామ్ చెప్పాడు. ముఖ్యంగా ఇటీవల రవి తేజ హీరోగా వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా అఫర్ ని మిస్ చేసుకున్నట్లు హీరో రామ్ చెప్పాడు. కెరీర్ లో 15 సినిమాలు తీస్తే కేవలం అయిదు మాత్రమే హిట్ అయ్యాయి. కానీ తనకు మొదట్లో అపజయాలు వస్తే బాధగా ఉండేదని ఆ తర్వాత అలవాటై పోయిందని రామ్ వివరించాడు.

ముఖ్యంగా మొదటి సినిమా దేవదేసు హిట్ అవ్వగానే సుకుమార్ దర్శకత్వంలో జగడం అనే సినిమా తీశాను. ఆ సినిమా నాకు చాలా ఇష్టం కానీ డిజాస్టర్ అయ్యింది. అదే విధంగా కరుణాకర్ డైరెక్షన్ లో వచ్చిన ఎందుకంటే.. ప్రేమంట సినిమా కూడా ఫెయిల్ అయ్యింది. ఆ రెండు సినిమాలపై నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను కానీ రెండు అపజయపాలవ్వడం బాధను కలిగించిందని రామ్ తెలిపాడు. అయితే ఇప్పుడు వచ్చే ఉన్నది ఒకటే జిందగీ సినిమా మాత్రం తప్పకుండా విజయం సాదిస్తుందని ఈ హీరో తెలిపాడు.