Begin typing your search above and press return to search.
నెక్స్ట్ ఏంటి రామ్
By: Tupaki Desk | 5 Jun 2018 11:30 PM GMTఎనర్జిటిక్ హీరో అనే ట్యాగ్ అయితే ఉంది కానీ దానికి తగ్గట్టు మాత్రం వేగంగా సినిమాలు చేయలేకపోతున్నాడు హీరో రామ్. ఒకడుగు ముందుకు వేస్తే ఐదడుగుల వెనక్కు వచ్చేలా చేస్తున్నాయి సినిమాలు. నేను శైలజతో ట్రాక్ లో పడ్డాడు అనుకుంటే తనకిష్టమైన మాస్ జానర్ లో ప్రయత్నించిన హైపర్ మొత్తానికే మోసం తెచ్చి పెట్టింది. సరే పోనీ అని మళ్ళి యూత్ ని టార్గెట్ చేసి ఉన్నది ఒకటే జిందగీ చేస్తే అది కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అందుకే ఏది చేయాలా అనే అయోమయంలో టైం చాలానే ఖర్చు పెడుతున్నాడు రామ్. ఇప్పుడు త్రినాధ్ రావు దర్శకత్వంలో చేస్తున్న హలో గురు ప్రేమ కోసమే షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇటీవలే దేవి శ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుకున్న ఈ మూవీ మహా అయితే ఓ నాలుగు నెలల్లో పూర్తయిపోతుంది. త్రినాథ రావు రెగ్యులర్ స్టైల్ అయిన మామ అల్లుళ్ళ గేమ్ ఫార్మాట్ లోనే ఇది కూడా ఉంటుందని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. దీని తర్వాత చేయబోయే సినిమా గురించి మాత్రం రామ్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు.
హలో గురు ప్రేమ కోసమే ఫలితం చూసి ఆ తర్వాత కథలు విందామా లేక ఇది షూటింగ్ లో ఉండగానే ఎవరైనా దర్శకుడు మెప్పిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేద్దామా అనే డైలమాలో కుర్రాడు ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు స్టార్ హీరోలు సైతం ప్రయోగాలకు సై అంటూ కొత్త జానర్లు టచ్ చేస్తూ సక్సెస్ తో పాటు పేరు కూడా అందుకుంటున్నారు. ఇంకా తాను మాత్రం లవ్-యూత్ అంటూ ప్రదక్షిణ చేస్తే లాభం లేదనుకున్నాడు కాబోలు విభిన్నమైన కాన్సెప్ట్ గురించి ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. కాకపోతే ఫామ్ లో ఉన్న దర్శకులు అందరు వాళ్ళ వాళ్ళ కమిట్మెంట్స్ తో బిజీ గా ఉన్నారు. మరి రామ్ తో చేసేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నది కూడా ఆసక్తికరమే. హలో గురు ప్రేమ కోసమే కూడా అఖిల్ కోసం రాసుకున్న కథని అక్కినేని ఫామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడానికి ఆలస్యం కావడంతో ఇది రామ్ కు వచ్చిందని గతంలోనే వార్తలు వచ్చాయి. అది నిజమో కాదో కానీ సినిమా హిట్ అయితే అవన్నీ పక్కకు వెళ్లిపోతాయి.ఈ లెక్కన రామ్ ఇప్పుడు కథల ఎంపిక అనే కసరత్తు భారీ ఎత్తున చేస్తున్నట్టే. అందం-డాన్స్-టాలెంట్ ఇన్ని ఉన్నా పరిశ్రమకు వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా రామ్ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.