Begin typing your search above and press return to search.

కథలను నేనే ఫైనల్ చేస్తాను

By:  Tupaki Desk   |   25 Oct 2017 1:30 PM GMT
కథలను నేనే ఫైనల్ చేస్తాను
X
టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్. మొదటి సినిమాలో మంచి ఎనర్జీ తో యువతను అక్కట్టుకున్నాడు. సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ను కూడా పెంచుకున్నాడు. అయితే ఆ మధ్యలో రామ్ కొన్ని అపజయాలను బాగానే ఎదుర్కొన్నాడు. చివరగా 2016 లో నేను శైలజ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన యువ హీరో మళ్లీ తడబడి ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.

నేను శైలజ సినిమాతో విజయాన్ని అందుకున్న రామ్ మళ్లీ అదే దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రామ్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను చెప్పాడు. కెరీర్ లో ఏ హీరోకైనా అపజయం తప్పదు అంటూ.. ఓటమి నుంచి పాటలు నేర్చుకోవడమే జీవితం అంటున్నాడు. ఉన్నది ఒకటే జిందగీ సినిమా గురుంచి మాట్లాడుతూ.. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. రెగ్యులర్ లవ్ స్టోరీలా కాకుండా ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేలా కొత్తగా ఉంటుంది. కిషోర్ స్టోరీ చెప్పగానే ఒకే చెప్పేశాను. ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత ఉంటుంది. హీరోయిన్స్ కూడా వారి క్యారెక్టర్స్ కి న్యాయం చేశారని చెప్పారు.

ఇక సినిమా కథల ఎంపిక విషయంలో మీ పెదనాన్న స్రవంతి రవి కిషోర్ గారి పాత్ర ఏమైనా ఉంటుందా అంటే రామ్ అలాంటిదేమి లేదని అంటున్నాడు. నిర్మాతగా అయనకి అనుభవం ఉంది. ఐడియాలు షేర్ చేసుకుంటాను. అలాగే ఆయన ఆలోచన కూడా బావుంటుంది. కాకపోతే సినిమాలను మాత్రం నేనే ఫైనల్ చేస్తానని రామ్ వివరించాడు. కాని స్రవంతి రవికిషోర్ ఐడియాలను తీసుకుని సినిమాలను చేస్తే.. అవి బాగా ఆడతాయేమో అంటున్నారు సినిమా లవ్వర్స్. ఎందుకంటే ఆయనకు టేస్ట్ ఉన్న నిర్మాతగా బాగా పేరుంది.