Begin typing your search above and press return to search.

హరికథలు చెబ్తున్నాడు.. ఏమవుద్దో

By:  Tupaki Desk   |   10 Oct 2015 10:30 PM GMT
హరికథలు చెబ్తున్నాడు.. ఏమవుద్దో
X
ఊహించని విధంగా శివం షాక్ ఇచ్చినా.. రామ్ జోరు తగ్గలేదు. ప్రస్తుతం శరవేగంగా హరికథలను కంప్లీట్ చేస్తున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. మాస్ ఎంటర్ టెయినర్లు చూసి ఎంజాయ్ చేసే జనాలకు షాక్ ఇచ్చే మూవీ ఇది అంటున్నాడు. ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో ఇలాంటి కంటెంట్ రాలేదని చెబ్తున్నాడు రామ్.

శివం షాక్ ఇచ్చిన మాట వాస్తవమే అయినా.. తన దగ్గరకు ఓ ప్రాజెక్ట్ ప్రతిపాదన వచ్చాక.. కేరక్టర్ తన ఏజ్ కి, ఎనర్జీకి సెట్ అవుతుందా లేదా అని చూస్కుంటాడట. మిగతా విషయాల బాధ్యత టెక్నికల్ టీందేనని, ఇతరుల వర్క్ లో వేలు పెట్టనని చెప్పాడీ ఎనర్జిటిక్ హీరో. ప్రస్తుతం చేస్తున్న హరికథను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని అంటున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ అయింది. శివం ఫ్లాప్ అయిన వారానికే సెట్స్ మీదకొచ్చేశాడు కూడా.

"నిజానికి ఈ మూవీ షూటింగ్ ను ముందే ప్రారంభించాం. ఇంకా చెప్పాలంటే పండగ చేస్కో ఫినిషింగ్ దశలోనే దీన్ని కూడా ప్రారంభించాం. ఒకేసారి పండగచేస్కో, శివం, హరికథల షూటింగ్స్ లో పాల్గొన్నాను. ఇన్ని ప్రాజెక్టులు ఒకేసారి చేయడం చాలా కష్టమైన పని అని అప్పుడే అర్ధమైంది" అంటున్నాడు రామ్. ప్రేక్షకులను ఎంటర్టెయిన్ చేసే ఏ రోల్ అయినా తనకు ఇష్టమే అనీ.. పర్టిక్యులర్ గా ఇలాంటి రోల్ చేయాలనే ఆశలేం లేవని తేల్చేశాడు. అయితే రామ్ ఇప్పటివరకూ పోలీస్ పాత్రను పోషించలేదు. ఖాకీ దుస్తుల్లో కనిపించలేదు. తన ఏజ్ కి ఇప్పుడే పోలీస్ పాత్రలు వద్దులే అని నవ్వేస్తున్నాడు రామ్.