Begin typing your search above and press return to search.

రామ్ క్రిస్టల్ క్లియర్‌ గా చెప్పేశాడు

By:  Tupaki Desk   |   6 Dec 2015 11:00 PM IST
రామ్ క్రిస్టల్ క్లియర్‌ గా చెప్పేశాడు
X
రొటీన్ సినిమాల్ని అస్సలు ఆదరించే పరిస్థితి లేదు ప్రస్తుతం టాలీవుడ్ లో. ఓ టెంప్లేట్ ప్రకారం తీసే సినిమాల్ని దారుణాతి దారుణంగా తిప్పి కొడుతున్నారు ప్రేక్షకులు. గత ఏడాది రభస, ఈ ఏడాది బ్రూస్ లీ లాంటి పెద్ద సినిమాలకు కూడా దెబ్బ చాలా గట్టిగానే తాకింది. యువ కథానాయకుడు రామ్ కూడా ఈ ‘రొటీన్’ పంచ్ బాధితుడే. రెండు నెలల కిందట విడుదలైన రామ్ సినిమా ‘శివమ్’ అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఈ సినిమా పరమ రొటీన్ గా ఉండటంతో జనాలు ఏమాత్రం ఆదరించలేదు. దీంతో ఇకపై ఇలాంటి రొటీన్ సినిమాలు చేయద్దని రామ్ గట్టిగానే ఫిక్సయినట్లున్నాడు.

తన కొత్త సినిమా ‘నేను శైలజ’ పూర్తిగా కొత్తగా సాగుతుందని.. ఇందులో కమర్షియల్ అంశాలు అస్సలు ఆశించవద్దని హెచ్చరిక జారీ చేస్తున్నాడు రామ్. ‘‘ఇప్పటిదాకా నేను చేసిన కమర్షియల్ సినిమాలన్నింటికీ ‘నేను.. శైలజ’ చాలా భిన్నంగా తెరకెక్కింది. ఇందులో ఓ తాజాదనం ఉంటుంది. ఇదొక ఫీల్ గుడ్ మూవీ. ఇందులో ఎలాంటి ‘మసాలా’ కోసం ఆశించవద్దు’’ అని చెప్పాడు రామ్. కుర్రాడి మాటల్ని బట్టి చూస్తుంటే ఈసారి ఏదో ఒక ప్రయోగం చేసినట్లే ఉంది. ‘పండగ చేస్కో’ టైంలో ప్రయోగాలు తనకు అస్సలు పడవంటూ జగడం, ఎందుకంటే ప్రేమంట లాంటి ఉదాహరణలు చూపించిన రామ్.. ‘శివమ్’ తర్వాత మళ్లీ కొత్తదనం గురించి మాట్లాడుతుండటం విశేషమే.కిషో్ర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేను శైలజ’ 2016 జనవరి 1న ప్రేక్షకుల మందుకు రానుంది.