Begin typing your search above and press return to search.

చేతిలో చెయ్యేసి బోయ‌పాటి బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రామిస్‌

By:  Tupaki Desk   |   1 Jun 2022 7:41 AM GMT
చేతిలో చెయ్యేసి బోయ‌పాటి బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రామిస్‌
X
ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది పేరు. ఇటీవ‌ల త‌న ఫామ్ కోల్పోయిన ఆయ‌న తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో చేసిన `అఖండ‌`తో అఖండమైన విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుని మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చారు. బోయ‌పాటి హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ల‌కు సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ ఫ్యాన్స్ వున్నారు. ఆయ‌న తెర‌కెక్కించిన హై వోల్టేజ్ యాక్ష‌న్ మూవీస్ హిందీలో డ‌బ్బింగ్ అయి యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. అలాంటి బోయ‌పాటి ఇప్పుడు పాన్ ఇండియా పై క‌న్నేశాడు.

ఉస్తాద్ ఇస్మార్ట్ రామ్ హీరోగా బోయపాటి శ్రీ‌ను ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై శ్రీ‌నివాస చిట్టూరి అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. బోయ‌పాటి మార్కు యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొంద‌నున్న ఈ మూవీని బుధ‌వారం పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాష‌ల్లో విడుద‌ల కానుంది. బోయ‌పాటి .. రామ్ ల తొలి క‌ల‌యిక‌లో రానున్న ఈ మూవీ బోయ‌పాటి డైరెక్ట్ చేస్తున్న 10వ సినిమా.

హీరో ఉస్తాద్ రామ్ కెరీర్ లో ఇది 20వ సినిమా. ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుసామి డైరెక్ష‌న్ లో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా `ది వారియ‌ర్‌` మూవీ చేస్తున్న రామ్ ఈ సినిమా పూర్త‌యి రిలీజ్ కి రెడీ అవుతున్న నేప‌థ్యంలో బోయ‌పాటి శ్రీ‌నుతో చేస్తున్న మూవీని ప‌ట్టాలెక్కించాడు. ఇటీవ‌ల `అఖండ‌` మూవీతో ఇండ‌స్ట్రీకి స‌రికొత్త ఉత్సాహాన్ని అందించిన బోయ‌పాటి శ్రీ‌ను తాజా చిత్రంతో పాన్ ఇండియా పి టార్గెట్ చేసుకున్నారు.

బోయ‌పాటి మార్కు యాక్ష‌న్ కి, రామ్ స్టైల్ ని యాడ్ చేసి స‌రికొత్త మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈమూవీని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. బుధ‌వారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది.

హీరో రామ్ పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ నిర్మాత బూరుగ‌ప‌ల్లి శివ‌రామ‌కృష్ణ కెమెరా స్విఛాన్ చేయ‌గా, ప్ర‌ముఖ నిర్మాత‌, హీరో రామ్ పెద‌నాన్న స్ర‌వంతి ర‌వికిషోర్ క్లాప్ నిచ్చారు. బోయ‌పాటికి దర్శ‌కులు ఎన్‌. లింగుసామి, వెంక‌ట్ ప్ర‌భు స్క్రిప్ట్ ని అంద‌జేశారు.

ఈ మూవీ ప్రారంభోత్స‌వంలో హీరో రామ్‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను చేతిలో చెయ్యేసి చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపించారు. ఈ ఫొటో చూస్తుంటే నీకు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇస్తానంటూ బోయ‌పాటి, ఖ‌చ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ రామ్ ఒక‌రికి ఒక‌రు ప్రామిస్ చేసుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. భారీ బ‌డ్జెట్ తో హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో ఈ మూవీని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. ఇత‌ర తారాగ‌ణం, సాంకేతిక నిపుల‌ణుల‌కు సంబంధించిన వివ‌రాల్ని త్వ‌ర‌లోనే వుల్ల‌డించ‌నున్నామ‌ని నిర్మాత తెలియ‌జేశారు.