Begin typing your search above and press return to search.

రామ్‌ బోయపాటి కాంబో... వాళ్లకెందుకు అంత టెన్షన్‌?

By:  Tupaki Desk   |   20 Feb 2022 11:31 AM GMT
రామ్‌ బోయపాటి కాంబో... వాళ్లకెందుకు అంత టెన్షన్‌?
X
రామ్‌ చరణ్‌ తో వినయ విధేయ రామ సినిమాను తెరకెక్కించి అట్టర్ ప్లాప్‌ అయిన బోయపాటి శ్రీను అనూహ్యంగా గోడకు కొట్టిన బంతి తరహాలో అఖండ సినిమాతో బ్యాక్ టు ఫీల్‌ అన్నట్లుగా వచ్చాడు.

వినయ విధేయ రామ సినిమా తర్వాత బోయపాటి పనైపోయింది అంటూ విమర్శించిన వారి నోళ్లు అఖండ సినిమాతో మూయించిన బోయపాటి అనూహ్యంగా తన తదుపరి సినిమాను ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ తో చేయబోతున్నాడు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై తాజాగా క్లారిటీ వచ్చేసింది.

రామ్‌ ప్రస్తుతం లింగు స్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కావచ్చింది. వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. రామ్‌ కు మంచి మాస్‌ కథలు బాగా సూట్‌ అవుతాయి.

చూడ్డానికి క్యూట్‌ బాయ్ లా ఉన్నా మాస్‌ కథలు చేసిన అనుభవం చాలా ఉంది. సక్సెస్ లు దక్కించుకున్న ఘనత ఆయనది. అందుకే బోయపాటి శ్రీను మరియు రామ్‌ ల కాంబో మూవీ అనగానే మాస్ ఆడియన్స్ పండుగే అనుకుంటున్నారు.

బోయపాటి కాస్త రామ్‌ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్‌.. స్క్రీన్‌ ప్లే ప్లాన్‌ చేస్తే కచ్చితంగా భారీ విజయంగా వీరి కాంబో మూవీ నిలుస్తుందని ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు. ఈ సమయంలోనే రామ్‌ అభిమానులు మాత్రం ఒకింత టెన్షన్‌ పడుతున్నారు.

కొందరు రామ్‌ అభిమానులు అతిగా ఊహించుకుని బోయపాటి డైరెక్షన్ గురించి తప్పుడు అభిప్రాయం తో ఈ సినిమా విషయంలో అనవసరంగా హడావిడి చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో వారు చేస్తున్న హడావుడికి ఒక అర్థం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బోయపాటి గొప్ప దర్శకుడు అనడంలో సందేహం లేదు.. కాని ఆయన బాలయ్య సినిమాల వరకే గొప్ప దర్శకుడేమో అనే అనుమానం వ్యక్తం అవుతుంది.

బాలయ్య తో చేసిన మూడు సినిమాలు సూపర్ హిట్‌. మద్యలో చేసిన సరైనోడు తప్ప పెద్దగా సక్సెస్ లు ఏమీ లేవు. దాంతో బోయపాటి తో రామ్‌ సినిమా ఎలా ఉంటుందో అనేది ఇప్పుడే చెప్పలేం.

వీరిద్దరి కాంబో సినిమా ఖచ్చితంగా స్పెషల్‌ గా ఉంటుంది. అయితే సూపర్ హిట్‌ లేదంటే నిరాశ పర్చడం. సూపర్‌ హిట్‌ కు ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే రామ్‌ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా ను బోయపాటి తీసిన తర్వాత ఖచ్చితంగా మేకింగ్‌ లో మార్పు వచ్చేసి ఉంటుంది.

ప్రేక్షకులు అంత ఈజీగా నమ్మేయరు ఏదీ కూడా అని ఆయనకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కనుక రామ్ తో చేయబోతున్న సినిమా కు ఖచ్చితంగా ఒక మోస్తరు హింస మాత్రమే ఉండవచ్చు.

బాలయ్య తో ఏం చేసినా నడుస్తుంది.. ఆయన స్టార్‌ డమ్‌ మరియు ఆయన ఇమేజ్ కు అలాంటిది. కాని రామ్‌ ఇమేజ్ మరియు స్టార్‌ డమ్‌ వేరు. కనుక బోయపాటి ఈ ఒక్క విషయం మైండ్ లో పెట్టుకోవాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. రామ్‌ అభిమానులు అంత టెన్షన్ పడనవసరం లేదు.

ఎందుకంటే బోయపాటి ఖచ్చితంగా గత ఫలితాల ను దృష్టిలో ఉంచుకునే సినిమాను చేస్తాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ఖచ్చితంగా ఒక మంచి మాస్‌ విందు బోజనం లా ఉంటుంది అనిపిస్తుంది.