Begin typing your search above and press return to search.
జై బాలయ్య.. అప్పుడు నాని ఇప్పుడు రామ్
By: Tupaki Desk | 19 Jun 2022 12:30 PM GMTనాని గతంలో నటించిన కృష్ణ గాడి వీర ప్రేమగాథ చిత్రంలో బాలయ్యకు వీరాభిమానిగా నటించిన విషయం తెల్సిందే. జై బాలయ్య నినాదం అప్పటి నుండే బాగా ఫేమస్ అయ్యింది. అంతకు ముందు అభిమానులు కొందరు జై బాలయ్య అనేవారేమో కాని నాని ఆ సినిమా నుండి బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా జై బాలయ్య అంటూ సరదాగానో లేదా సీరియస్ గానో నినదిస్తూనే ఉన్నారు.
అప్పుడు నాని జై బాలయ్య నినాదంతో వచ్చాడు. ఇప్పుడు రామ్ కూడా జై బాలయ్య అనబోతున్నాడట. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం ది వారియర్ సినిమా తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత రామ్ చేయబోతున్న సినిమా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమాలో రామ్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం అందుతోంది.
రామ్ ను ఒక బాలకృష్ణ వీరాభిమాని పాత్రలో బోయపాటి చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య సినిమాలను చూసి ఇన్సిపైర్ అయ్యి విలన్స్ ను ఢీ కొట్టి నవ్వు పుట్టించడంతో పాటు నందమూరి అభిమానులను ఆకట్టుకునే విధంగా రామ్ పాత్ర ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
రామ్ ను బాలయ్య అభిమానిగా చూపిచడం ద్వారా బోయపాటి సినిమా అప్పుడే సగం సక్సెస్ అయ్యిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో నాని చేసిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా ప్లాప్ కాలేదు అలా అని హిట్ కాలేదు. ఒక మోస్తరు సినిమాగా నిలిచింది. బాలయ్య పేరు చెప్పడం వల్ల ప్రమోషన్ కూడా బాగా జరిగిందని అప్పట్లో టాక్ బాగా నడిచింది.
ఇప్పుడు రామ్ సినిమా కూడా అప్పుడే వార్తల్లో నిలిచింది. బాలయ్య పేరు ఉండటం వల్ల ఖచ్చితంగా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుంది అనే నమ్మకంతో అంతా ఉన్నారు. ఇండస్ట్రీలో బాలయ్య అభిమానులు చాలా మంది ఉంటారు. ఇలా ఒక హీరో సినిమా లో మరో హీరో రిఫరెన్స్ లు పెట్టడం వల్ల మంచి పబ్లిసిటీ దక్కతుంది.
ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ సినిమాను ఒక మోస్తరుగా ఉండేలా తీసినా కూడా ఖచ్చితంగా చాలా మంచి వసూళ్లు నమోదు అవ్వడంతో పాటు.. సక్సెస్ ను దక్కించుకున్న దాఖలాలు ఉన్నాయి. అందుకే రామ్ ఈ సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నాడు. బోయపాటి గత చిత్రం అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సినిమా కూడా ఆ సినిమా స్థాయిలో ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. రామ్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.