Begin typing your search above and press return to search.
'వారియర్' ఫలితంతో బోయపాటి పై ఒత్తిడి మొదలైందా?
By: Tupaki Desk | 24 July 2022 11:30 PM GMTఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా నటించిన `వారియర్` ఇటీవలే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ వాటిని అందుకోవడంలో `వారియర్` వెనుకబడ్డాడు. రొటీన్ కథే అయినా..లింగ్ స్వామి మార్క్ యాక్షన్ సినిమాలో పెద్దగా కనిపించలేదని విమర్శలొస్తున్నాయి. ఆరకంగా లింగు స్వామి బ్రాండ్ పై సైతం వారియర్ కొంత ప్రభావాన్ని చూపిస్తుంది.
మరి ఈ సినిమా ఫలితంతో బోయపాటి శ్రీనుపై ఒత్తిడి మొదలైందా? రామ్ విషయంలో తర్జన భర్జన పడుతున్నారా? అంటే అవుననే వినిపిస్తుంది. బోయపాటి `అఖండ` సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చేసారు. 100 కోట్ల వసూళ్లతో `అఖండ`ని బాలయ్య కెరీర్ కి మరో మైల్ స్టోన్ మూవీగా అందించారు. `సింహా`..`లెజెండ్` తర్వాత `అఖండ`తో హ్యాట్రిక్ అందుకున్న ద్వయంగా టాలీవుడ్ చరిత్రలో నిలిచారు.
ఈ నేపథ్యంలో త్వరలో రామ్ తో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. వారియర్ హిట్ అయితే రెంట్టించిన ఉత్సాహంలో అదే ఊపును కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోవాలని బోయపాటి ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్ర్కిప్ట్ లాక్ అవ్వడం...టీమ్ సర్వం సిద్దం చేయడం అంతా వేగంగానే జరిగిపోయింది.
అయితే `వారియర్` ఫలితంతో బోయపాటి కథలో మార్పులు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కమర్శియల్ అంశాల విషయంలో రొటీన్ గా అనిపించినా పాయింట్స్ లో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గానీ...ప్రచారం అయితే షురూ అయింది.
అయితే సినిమా మొదలు పెట్టిన తర్వాత మధ్యలో స్ర్కిప్ట్ పరంగా బోయపాటికి మార్పులు చేయడం తొలి నుంచి ఉన్న అలవాటు. స్ర్కిప్ట్ బెటర్ మెంట్ కోసం అలా చేస్తుంటారు. మరి రామ్ సినిమా విషయంలో బెటర్ మెంట్స్ చేస్తున్నారా? అసవరం మేర చిన్నపాటి మార్పులే చేస్తున్నారా? అన్నది చూడాలి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఈసారి కథ విషయంలో బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. రామ్ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా నెక్ట్స్ లెవల్ రామ్ ని చూపించడానికి ఆస్కారం ఉంది.