Begin typing your search above and press return to search.
కింద సెంటర్లో ఆడుతుంతా భయ్యా?
By: Tupaki Desk | 11 March 2020 10:10 AM GMT`ఇస్మార్ట్ శంకర్` బ్లాక్ బస్టర్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అదే స్పీడ్ లో వరుసగా మరో రెండు.. మూడు సక్సెస్ లు కొట్టి టాలీవుడ్ టాప్ స్లాట్ లో స్థానం సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకే సేఫ్ గా సక్సెస్ లు ఇచ్చే దర్శకులతోనే మూవ్ అవుతున్నాడు. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సైకలాజికల్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. గతంలో ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిన `నేను శైలజ` మంచి విజయం సాధించగా..వెంటనే అదే దర్శకుడితో `ఉన్నది ఒకటే జిందగీ` చేసాడు. ఆ సినిమా యావరేజ్ గా ఆడింది.
ఆ కాన్ఫిడెన్స్ తోనే మరోసారి కిషోర్ తిరుమల స్క్రిప్ట్ కి ఒకే చెప్పి పట్టాలెక్కించాడు. అయితే ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. రామ్ ఈ జానర్ సినిమా చేయడం ఇదే తొలిసారి. దీంతో కొంచెం రిస్క్ అనే విమర్శ వినిపిస్తోంది. తాజాగా రామ్ గతంలో అన్న ఓ మాటను గుర్తు చేసుకుంటే...ఆ వ్యాఖ్యకి..ఈ సినిమాకి ఏ మాత్రం సింక్ అవ్వడం లేదు. బిసీ ఆడియన్స్ ని.. కింద సెంటర్లని టార్గెట్ చేసి వాళ్లను మెప్పించే స్క్రిప్ట్ లు చేస్తే చాలు..సక్సెస్ దానంతటదే వస్తుంది భయ్యా అన్నాడు. మరి ప్రస్తుతం చేస్తోన్న రెడ్ ఆ వర్గానికి రీచ్ అవుతుందా భయ్యా? అంటూ కొంత మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రామ్ చేసిన వ్యాఖ్యలు కారణంగానే ప్రతిగా ఇలాంటి ప్రశ్నలు రామ్ కి ఎదురవుతున్నాయి.
సైకలాజికల్ థ్రిల్లర్లు.. సస్పెన్స్ థ్రిల్లర్ లు అనేవి కేవలం మల్టీప్లెక్స్ లకు మాత్రమే పరిమితం అనడానికి పలు ఉదాహరణలు ఉన్నాయి. మరి వీటిని రామ్ ఇప్పుడు ఓవర్ కమ్ చేస్తాడా? మల్లీప్లెక్స్ లకే కాకుండా బీ-సీ సెంటర్లలోనూ ఆ కిక్ ను ఇస్తాడా? అన్నది చూడాలి. ప్రస్తుతం రెడ్ సెట్స్ లో ఉంది. ఇటీవలే విదేశాల్లో కీలక షెడ్యూల్ పూర్తిచేసారు. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ లో సినిమా విడుదల కానుంది.