Begin typing your search above and press return to search.

ఎనర్జిటిక్ హీరో ఖాతాలో ఎదురులేని రికార్డ్!

By:  Tupaki Desk   |   27 Feb 2022 4:30 AM GMT
ఎనర్జిటిక్ హీరో ఖాతాలో ఎదురులేని రికార్డ్!
X
టాలీవుడ్లో చాలా యాక్టివ్ గా సినిమాలను సెట్ చేసుకునే యంగ్ హీరోల్లో రామ్ ఒకరు. తెరపై రామ్ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. తెరపై కనిపిస్తున్నత సేపు కథను .. సన్నివేశాలను పరిగెత్తించడం రామ్ ప్రత్యేకత. ఆయన తెరపై ఉన్నంతవరకూ ఆడియన్స్ లో ఊపు .. ఉత్సాహం ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగానే కథలను .. పాత్రలను రచయితలు .. దర్శకులు డిజైన్ చేస్తుంటారు. ఇతర హీరోల సినిమాల మాదిరిగానే రామ్ తెలుగు సినిమాలు కూడా హిందీ యూ ట్యూబ్ ఛానల్స్ కోసం డబ్ అవుతుంటాయి.

మన తెలుగు సినిమాల హిందీ వెర్షన్ కి యూ ట్యూబ్ లో భారీ రెస్పాన్స్ వస్తుంటుంది. తెలుగు కథలు .. హీరోల బాడీ లాంగ్వేజ్ .. ఇక్కడి కథల్లోని యాక్షన్ .. కామెడీలను వాళ్లు ఎక్కువగా లైక్ చేస్తుంటారు. రామ్ విషయానికి వచ్చేసరికి ఆయన కథల్లోని వేగం .. డాన్స్ .. ఫైట్స్ అన్నిటిలోను ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఆ స్పెషాలిటీనే ఆయన హిందీ సినిమాలకు ఎక్కువ మంది వ్యూవర్స్ ను తెచ్చిపెడుతోంది. ఆయన మొదటి సినిమా అయిన 'దేవదాసు' నుంచి 'ఇస్మార్ట్ శంకర్' వరకూ కూడా హిందీలో పలు యూ ట్యూబ్ ఛానల్స్ లో రిలీజ్ చేయడం జరిగింది.

ఆ సినిమాలన్నిటికీ కలిసి 2 బిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. 2 బిలియన్స్ కి పైగా వ్యూస్ అందుకున్న ఏకైక దక్షిణాది హీరోగా రామ్ ఒక సెన్సేషనల్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు రామ్ ఎవరనేది హిందీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అందువల్లనే రామ్ కూడా ఇక తన సినిమాలు తెలుగుతో పాటు హిందీలోను విడుదలయ్యేలా చూసుకునే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'ది వారియర్' సినిమాను తమిళంతో పాటు హిందీలోను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాను ఆయన తమిళ డైరెక్టర్ లింగుసామితో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా కృతి శెట్టి అలరించనుంది. ఆ తరువాత సినిమాను ఆయన బోయపాటితో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా పరిణీతి చోప్రా పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది. ఈ సినిమా కూడా హిందీలో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.