Begin typing your search above and press return to search.
ఉస్తాద్ రెడీ.. సెట్స్ పైకి వెళ్తున్న #RAPO19..!
By: Tupaki Desk | 8 July 2021 11:30 AM GMTటాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్, 'ఉస్తాద్' రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బౌండ్ స్క్రిఫ్ట్ తో దర్శకుడు లింగుసామి రెడీగా ఉండటంతో రామ్ కూడా షూటింగ్ చేయడానికి రెడీ అయ్యారు. వీళ్లిద్దరి కాంబోలో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి నిర్మాత శ్రీనివాసా చిట్టూరి రెడీ అయ్యారు. రామ్ కెరీర్ లో వస్తున్న 19వ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఈ నెల 12 నుంచి ప్రారంభించనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
డబ్బింగ్ సినిమాలతో తమిళ, హిందీ ప్రేక్షకులకు చేరువైన రామ్.. ఇంతవరకు స్ట్రయిట్ తమిళ సినిమా చేయలేదు. అటు లింగుసామి కూడా తెలుగులో సినిమా చేయలేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమా చేస్తారని ఎవరూ ఊహించలేదు. స్టయిలిష్ రోల్స్ తో పాటు మాస్ క్యారెక్టర్లలో మెప్పించిన హీరో రామ్. మాస్ సినిమాలకు పెట్టింది పేరు దర్శకుడు లింగుస్వామి. అందుకే ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అందరిలోనూ ఆసక్తి ఎక్కువైంది. స్క్రిప్ట్ ఫుల్ నేరేషన్ తర్వాత రామ్ చేసిన ట్వీట్ ఈ సినిమాపై అంచనాలకు మరింత పెంచింది. ఇదే హుషారులో ఇప్పుడు ఊర మాస్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి #RAPO19 టీమ్ రెడీ అవుతోంది.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.6 గా ఈ బైలింగ్విల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందనుంది. ఇందులో రామ్ సరసన 'ఉప్పెన' ఫేమ్ కృతీ శెట్టి హీరోయిన్ గా నటించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకురుస్తున్నారు. 'దృశ్యం' 'లూసిఫర్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు పని చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవ్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. 'కె.జి.యఫ్' చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు-అరివు ద్వయం దీనికి యాక్షన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. 'క్రాక్' చిత్రానికి పవర్ ఫుల్ డైలాగ్స్ రాసిన ప్రముఖ సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రామ్ పోతినేని క్రేజ్ అమాంతం పెరిగింది. అప్పటి వరకు సక్సెస్ ఫుల్ హీరోగా బిజీగా ఉన్న రామ్ ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు. ఆ ప్రభావం నెక్ట్స్ వచ్చిన 'రెడ్' సినిమా మీద కూడా పడింది. కాకపోతే 'రెడ్' పెద్దగా ఆడకపోయినప్పటికీ రామ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో ఇప్పుడు లింగుస్వామి దర్శకత్వంలో తొలి ద్విభాషా చిత్రం చేస్తున్నారు. 'రన్' 'ఆవారా' 'పందెంకోడి' వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన లింగుసామి చేస్తున్న మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జులై 12న ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ''రామ్ తో సినిమా చేయాలని చాలా కాలంగా ఒక మంచి సబ్జెక్ట్ కోసం చూస్తున్నాం. లింగుసామి చెప్పిన పవర్ ఫుల్ ఊర మాస్ సబ్జెక్ట్ మా అందరికీ నచ్చి రామ్ కి కథ వినిపించాం. కథ వినగానే ఆయన కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. వెంటనే సినిమా చేద్దామన్నారు. రీసెంట్ గా రామ్‌కు లింగుసామి ఫైనల్ నేరేషన్ ఇచ్చారు. హీరో మరింత ఎగ్జైట్ అయ్యారు. సూపర్ ఎనర్జీతో షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ నెల 12న హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం'' అని అన్నారు.
''ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ లవ్ సాంగ్ ట్యూన్ కంపోజ్ చేశారు. మిగతా సాంగ్స్ కూడా అద్భుతంగా వస్తున్నాయి. సుజీత్ వాసుదేవ్ - అన్బు-అరివు - నవీన్ నూలి - సాయిమాధవ్ బుర్రా వంటి టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. మా బ్యానర్ లో భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వేల్యూస్ తో తెలుగు, తమిళ భాషల్లో ప్రెస్టీజియస్ గా ఈ మూవీని రూపొందిస్తున్నాం. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తాం'' అని నిర్మాత శ్రీనివాస చిట్టూరి తెలిపారు.