Begin typing your search above and press return to search.
ఆ రెండు హిట్టైతే రామ్ వారి చెంత చేరినట్టే!
By: Tupaki Desk | 26 Jun 2022 8:30 AM GMTటాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో `ఇస్మార్ట్ శంకర్` ఒకటి. అప్పటి వరకు లవర్ బాయ్ గా ఉన్న రామ్.. ఈ మూవీ ద్వారా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసి మాస్ హీరోగా కావాల్సినంత క్రేజ్ సంపాదించుకున్నాడు. పైగా `ఇస్మార్ట్ శంకర్` హిట్ అనంతరం మాస్ ఆడియెన్స్ కు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశంతో మాస్ కథల వైపే రామ్ మొగ్గు చూపుతున్నాడు.
ఇందులో భాగంగానే రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి `ది వారియర్`. తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామి రూపొందించిన ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. పవర్ ఫుల్ విలన్ పాత్రను ఆది పినిశెట్టి పోషించాడు. అలాగే ఈ సినిమాలో రామ్ తన కెరీర్ లోనే తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జులై 14న తెలుగు, తమిళ్ భాషల్లో అట్టహాసంగా విడుదల కాబోతోంది. `ది వారియర్` అనంతరం రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేయబోతున్నాడు. రామ్ కు ఇది 20వ ప్రాజెక్ట్ కావడంతో.. `RAPO 20` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అఫీయల్ గా అనౌన్స్ చేశారు.
ఈ సినిమాను సైతం శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నే నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీని పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందించబోతున్నారు. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ఈ మూవీని గ్రాండ్ గా ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ కాబోతోంది.
అయితే ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టాలని రామ్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రామ్ ఇప్పుడు టైర్ 2 హీరోల జాబితాలో ఉన్నారు. ఒకవేళ `ది వారియర్` మరియు `RAPO 20` చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిస్తే.. ఆయన టైర్ 1 హీరోల చెంత చేరడం ఖాయమవుతుంది. మరియు రామ్ మార్కెట్ సైతం వేరె లెవల్ లో ఇంప్రూవ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు చిత్రాలపై ఆయన ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారట.