Begin typing your search above and press return to search.
మాస్ హీరో అనిపించుకున్న రామ్..!
By: Tupaki Desk | 15 July 2022 4:37 AM GMT'దేవదాస్' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రామ్ పోతినేని.. డాన్సులు ఫైట్స్ నటనలో ప్రత్యేకతను చాటుకున్నాడు. ఎనర్జిటిక్ స్టార్ గా ఉస్తాద్ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుని మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.
కెరీర్ ప్రారంభం నుంచీ మాస్ హీరోగా నిలదొక్కుకోడానికి ట్రై చేస్తున్న రాపో.. 'ఇస్మార్ట్ శంకర్' లో తన మాస్ అంతా చూపించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'రెడ్' పర్వాలేదనిపించింది. ఈ క్రమంలో ఇప్పుడు ''ది వారియర్'' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్.
లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన సినిమా 'ది వారియర్'. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది తమిళ దర్శకుడు9 లింగుస్వామికి ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా. రాపో కి కోలీవుడ్ డెబ్యూ.9
ప్రమోషనల్ కంటెంట్ తో బాగా సందడి చేసిన 'ది వారియర్' మూవీ నిన్న గురువారం వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వచ్చింది. అయితే భారీ అంచనాల నడుమ రిలీజ్ డే నాడు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కొత్తదనం లేని లైన్ లో.. ఒక రొటీన్ కమర్షియల్ సినిమాతో వచ్చారనే టాక్ వచ్చింది.
వారియర్ చిత్రానికి మొదటి ఆట మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. బి - సి సెంటర్స్ లో మంచి వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది పక్కా మాస్ మసాలా మూవీ కావడంతో ఓ వర్గం సినీ అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు.
అందులోనూ 'ది వారియర్' లో రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. రెండు వేరియేషన్స్ ఉన్న క్యారక్టర్ లో.. డాక్టర్ గా పవర్ ఫుల్ పోలీససాఫీసర్ గా రామ్ అలరించారు. హుషారైన మాస్ డ్యాన్స్ లతో.. పక్కా మాస్ యాక్షన్ తో అదరగొట్టాడు.
ముఖ్యంగా రామ్ పోతినేని పోలీస్ గెటప్ మరియు ఆ పాత్రలోని ఇంటెన్సిటీ మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. తొలిసారిగా ఖాకీ ధరించిన రామ్ ఫ్యాన్స్ ను కూడా మెప్పించారు. సినిమా టాక్ ఎలా ఉంది.. ఫలితం ఎలా ఉందనేది పక్కన పెడితే.. 'ది వారియర్' మూవీతో రామ్ ఒక మాస్ హీరో అనిపించుకున్నాడని చెప్పాలి.
ఇకపోతే ఈ వారంలో మరే ఇతర పెద్ద సినిమాలు లేకపోవడం.. సినీ ప్రియులకు 'ది వారియర్' ఒక్కటే ఛాయిస్ గా ఉండటం కలిసొచ్చే అంశాలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రామ్ నటించిన ఈ ఫస్ట్ బైలింగ్విల్ మూవీ ఎలాంటి వసూళ్ళు రాబడుతుందో చూడాలి.
కాగా, 'ది వారియర్' సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆది పిన్నిశెట్టి విలన్ గా నటించగా.. అక్షయ గౌడ కీలక పాత్రలో కనిపించింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
ఇక రామ్ పోతినేని త్వరలో ఓ భారీ ప్రాజెక్ట్ కోసం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో కలవబోతున్నారు. ఇది దర్శక హీరోలిద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. డబ్బింగ్ సినిమాలతో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న వీరు.. ఈసారి నేరుగా పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నారు. మరి రామ్ ఎనర్జీ మరియు బోయపాటి మాస్ కలిసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.