Begin typing your search above and press return to search.
తాతగారి మరణంతో చలించిపోయిన రాపో
By: Tupaki Desk | 18 May 2021 8:30 AM GMTటాలీవుడ్ లో ప్రముఖ హీరోగా వెలుగొందుతున్నారు రామ్ పోతినేని అలియాస్ రాపో. కానీ పిల్లల ఎదుగుదల వెనక పూర్వీకుల కఠోర శ్రమ ఎలా ఉంటుందో అతడు చెప్పిన తీరు హృదయాన్ని తాకుతోంది. తన తాతగారి కష్టం ఈరోజు తాము ఇలా ఉండడానికి కారణమని.. ఆయన కలలు గన్నందునే ఇది సాధ్యమైందని.. రాపో చెప్పిన సంగతులు ద్రవింపజేస్తున్నాయి. రామ్ పోతినేని తన తాతగారి గురించి ఏమని చెప్పారు అంటే..!
విజయవాడలో ఒక లారీ డ్రైవర్(తాతగారు) వినయపూర్వకమైన ప్రారంభ రోజుల నుంచి.. మంచం క్రింద లారీ టైర్లతో నిద్రిస్తూ మీ కుటుంబాన్ని పోషించడం కోసం కష్టించిన తీరు.. అది ఎల్లప్పుడూ రాజు (కింగ్) హృదయం అని నిరూపణ అయ్యింది.
గొప్పతనాన్ని మీ జేబులో ఉన్న వాటి నుండి కాకుండా మీ హృదయంలో ఉన్న వాటి నుండి వచ్చినట్లు మీరు మాకు చూపించారు. మీ పిల్లల కోసం పెద్దగా కలలు కన్నందుకు .. ఈరోజు వాటిని తయారుచేసినందుకు ధన్యవాదాలు.
రెస్ట్ ఇన్ పీస్.. తాతగారు...!! అంటూ విరిగిన గుండె ఈమోజీని షేర్ చేశారు #RAPO. తన తాతగారి మరణానంతరం రామ్ పోతినేని ఎమోషనల్ ట్వీట్ ఇది. నిజంగానే తాతపై మనవడి ప్రేమాభిమానాలు హృదయాంతరాళం నుంచి పుట్టుకొచ్చినవి అని ఈ నోట్ చెబుతోంది. రామ్ పోతినేని ఈ స్థాయి వెనక నాడు ఆయన తాతగారి శ్రమ మరువనిది. ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ తాతయ్యా ఆత్మ శాంతించాలని స్వర్గంలో విశ్రాంతి తీసుకోవాలని ట్వీట్ల రూపంలో తెలిపారు.