Begin typing your search above and press return to search.

RAPO పవర్ఫుల్ లైనప్ మామూలుగా లేదు

By:  Tupaki Desk   |   12 July 2022 1:30 AM GMT
RAPO పవర్ఫుల్ లైనప్ మామూలుగా లేదు
X
యువ హీరో రామ్ పోతినేని మొదట లవ్ స్టోరీ సినిమాలు చేసి ఆ తర్వాత మాస్ సినిమాలతో తన మార్కెట్ను పెంచుకోవాలి అని గట్టిగానే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి మొదట్లో మాత్రం మాస్ సినిమాలతో ఊహించనివిధంగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మాత్రం రామ్ పోతినేని తన స్టైల్ ను పూర్తిగా మార్చేశాడు. ఆడియన్స్ తప్పకుండా తనను మాస్ పాత్రలో కూడా యాక్సెప్ట్ చేస్తారు అని ఒక క్లారిటీ కి వచ్చాడు.

ఇక అదే పనిగా ప్రస్తుతం పవర్ఫుల్ దర్శకులను సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ కూడా అదే తరహాలో అడుగులు వేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన ది వారియర్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఈ సినిమాకు మరో సీక్వెల్ కూడా ఉంటుంది అని దర్శకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా తప్పకుండా ఈ రామ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తన మనసులోని మాటను చెప్పేశాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ కాంబినేషన్ మరొకసారి కలిసే అవకాశం ఉంది.

గతంలో దర్శకుడు పూరి జగన్నాథ్ తను కష్టాల్లో ఉన్నప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు కాబట్టి అతనితో రామ్ తో మరో సినిమా చేసి సక్సెస్ కొట్టాలని ఉన్నట్లు వివరణ ఇచ్చాడు. ఇక ఇంతకు ముందే బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నట్లు వివరణ ఇచ్చాడు. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతోంది అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఈ పవర్ఫుల్ లైనప్ చూస్తూ ఉంటే రామ్ పోతినేని చాలా తొందరగానే అగ్ర హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ ను సెట్ చేసుకునేలా ఉన్నాడు అని అనిపిస్తుంది. మరీ ఆ కాంబినేషన్స్ ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.