Begin typing your search above and press return to search.

ఆయనకు ఎప్పటికీ రుణపడే ఉంటాను

By:  Tupaki Desk   |   23 May 2015 3:30 PM GMT
ఆయనకు ఎప్పటికీ రుణపడే ఉంటాను
X
''ఎక్కడో చెన్నయ్‌లో తమిళ సినిమాల్లో ట్రై చేసుకుంటూ ఉంటే.. నన్ను ఇక్కడ లాక్కొచ్చి, లక్‌ ఇచ్చి, తొలి సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్టిచ్చి ఇంతవాడిని చేసిన వైవిఎస్‌ చౌదరి గారికి ఎప్పటికీ రుణపడే ఉంటాను. హ్యాపీ బర్త్‌డే'' అంటూ కృతజ్ఞతలలో పాటు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు హీరో రామ్‌. అసలు తమకు లైఫ్‌ ఇచ్చిన డైరక్టర్లను గుర్తు పెట్టుకునేది ఎంత మంది?

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లు బాలచందర్‌ను మా గురువు గారు అంటూ పొగిడినట్లు అసలు వేరే ఏ హీరో అయినా ఎవరి పేరైనా చెప్పడం చూశామా? అంతటి సంస్కారం మనోళ్ళకు పెద్దగా లేదు. లెజెండ్స్‌గా ఎదిగిన చాలామంది హీరోలు అసలు లైఫ్‌ ఇచ్చిన డైరక్టర్స్‌ను ఎప్పుడూ గుర్తు పెట్టుకోలేదని చరిత్ర చెబుతోంది. ఈ సమయంలో ఇంకా ఒక స్టార్‌ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలోనే ఉన్న రామ్‌ మాత్రం.. అసలు ఏ మాత్రం సంకోచించకుండా తనకు లైఫ్‌ ఇచ్చాడంటూ వైవిఎస్‌కు శుభాకాంక్షలు తెలపాడు.

ఈ క్షణాన వైవిఎస్‌ చౌదరి ఒకింత ఫ్లాపుల్లో కూరుకుపోయి అప్పులు పాలై ఉండొచ్చు. కాని అతడిలోని డైరక్టర్‌ ఎప్పుడూ టాపే. హీరో రామ్‌తో పాటు, నడుం సన్నజాజి ఇలియానాను తెలుగు తెరకు తెచ్చిందీ ఈయనే. త్వరలోనే బంపర్‌ హిట్‌తో మళ్ళీ ప్రేక్షకులను పలకరిస్తాడని కోరుకుంటూ.. వైవిఎస్‌కు బర్త్‌డే విషెస్‌ తెలియజేద్దాం.