Begin typing your search above and press return to search.

నార్త్ లో రామ్ ర్యాంపేజ్.. ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరోగా రికార్డ్..!

By:  Tupaki Desk   |   26 Feb 2022 10:30 AM GMT
నార్త్ లో రామ్ ర్యాంపేజ్.. ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరోగా రికార్డ్..!
X
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని డబ్బింగ్ చిత్రాలతో నేషనల్ వైడ్ క్రేజ్ ఏర్పరచుకున్నారు. రామ్ నటించిన ప్రతీ సినిమా హిందీలోకి డబ్ కాబడి మిలియన్ల కొలదీ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలో యూట్యూబ్ లో ఉస్తాద్ హీరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లో మెయిన్ స్ట్రీమ్ ఫ్లాట్ ఫార్మ్స్ లో ఒకటిగా ఉద్భవించింది. అలానే తెలుగు చిత్రాలకు హిందీ ప్రేక్షకులలో ఇటీవల కాలంలో ఆదరణ బాగా పెరిగింది. అక్కడి ఆడియన్స్ మన కమర్షియల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ లను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు యువ హీరో రామ్ పోతినేని నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు హాట్ షాట్ ఫేవరెట్‌ గా నిలిచాడు.

రామ్ నటించిన సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్స్ అన్నీ యూట్యూబ్‌ లో ఏకంగా 2.07 బిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. దీంతో యూట్యూబ్‌ లో 2 బిలియన్ల వ్యూస్ ఘనత వహించిన మొదటి హీరోగా.. ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా రామ్ పోతినేని నిలిచారు.

యూట్యూబ్ లో రామ్ హిందీ డబ్బింగ్ చిత్రాల వ్యూస్ పరిశీలిస్తే..
* 'దేవదాసు' - 'సబ్సే బడా దిల్వాలా' - 32M (మల్టిఫుల్ ఛానెల్స్)
* 'జగడం' - 'డేంజరస్ ఖిలాడీ రిటర్న్స్' - 31M
* 'మస్కా' - 'ఫూల్ ఔర్ కాంటే' - 25M (రెండు ఛానెల్స్)
* 'రామ రామ కృష్ణ కృష్ణ' - 'నఫ్రత్ కి జంగ్' - 16M (రెండు ఛానెల్స్)
* 'గణేష్' - 'క్షత్రియ ఏక్ యోధ' - 207M (రెండు ఛానెల్స్)
* 'కందిరీగ' - 'డేంజరస్ ఖిలాడీ 4' - 25M (రెండు ఛానెల్స్)
* 'ఎందుకంటే ప్రేమంట' - 'డేంజరస్ ఖిలాడీ 5' - 12M
* 'మసాలా' - 'చీటర్ కింగ్' - 50M (రెండు ఛానెల్స్)
* 'పండగ చేస్కో' - 'బిజినెస్ మ్యాన్ 2' - 23M
* 'నేను శైలజ' - 'ది సూపర్ ఖిలాడి 3' - 440M
* 'ఉన్నది ఒకటే జిందగీ' - 'నెం.1 దిల్ వాలా' - 317M (రెండు ఛానెల్స్)
* 'హలో గురు ప్రేమ కోసమే' - 'ధుమ్ దార్ ఖిలాడి' - 404M
* 'హైపర్' - 'సన్ ఆఫ్ సత్యమూర్తి 2' - 170M
* 'ఇస్మార్ట్ శంకర్' - 'ఇస్మార్ట్ శంకర్' - 255M

ఇలా రామ్ హిందీ డబ్బింగ్ చిత్రాలు అన్నీ కలిసి మొత్తం 2.07B వ్యూస్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రాపో మార్కెట్ హద్దులు దాటింది. అతని సినిమాల డబ్బింగ్ రైట్స్ - డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడు పోతున్నాయి. ప్రస్తుతం నటిస్తున్న ''వారియర్'' మూవీ హిందీ డబ్బింగ్ హక్కులు దాదాపు 16 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం.

ఇదే క్రమంలో రామ్ పొతినేని ఇప్పుడు ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి #RAPO20 కోసం పనిచేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది. నార్త్ ఇండియన్ సర్క్యూట్‌ లో రామ్ మరియు బోయపాటి ఇద్దరికీ మంచి ఆదరణ ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ ధర పలుకుతాయనడంలో సందేహం లేదు.

రామ్ కూడా దేశవ్యాప్తంగా తన మార్కెట్‌ ను విస్తరించుకోవడంపై దృష్టి సారించాడు. దీనికి తగ్గట్టుగానే ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ లను సెట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో చేస్తున్న 'వారియర్' చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. దీని తర్వాత బోయపాటి శ్రీను చిత్రంతో పాన్ ఇండియాను టార్గెట్ చేయబోతున్నారు.