Begin typing your search above and press return to search.
కన్ఫమ్.. రామ్ పండగ చేస్కోవచ్చు
By: Tupaki Desk | 22 Sep 2015 11:30 AM GMTమొన్నే ‘పండగ చేస్కో’తో హిట్టు కొట్టాడు రామ్. తన కొత్త సినిమా ‘శివమ్’ మీద కూడా చాలా ఆశలతో ఉన్నాడు. ఐతే ‘కంచె’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంతో పోటీకి వెళ్తున్నాడే దెబ్బయిపోతాడేమో అని జనాలు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడా అడ్డు తొలగిపోయింది. రామ్ సినిమా అక్టోబరు 2కు సోలోగా వచ్చేస్తోంది. ‘కంచె’ వాయిదా పడుతుందేమో అని ఉదయం వచ్చిన రూమరే నిజమైంది. ‘కంచె’ను అక్టోబరు 2 నుంచి నవంబరుకు వాయిదా వేస్తున్న సంగతి అఫీషియల్ గా కన్ఫమ్ చేశారు. హీరో వరుణ్ తేజ్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించాడు. తమ సినిమా నవంబరు 6కు వాయిదా పడినట్లు చెప్పిన వరుణ్ తేజ్.. దీనికి కారణమేంటో తర్వాత వెల్లడిస్తామని చెప్పాడు.
కంచె వచ్చేట్లయితే ‘శివమ్’కి చాలా ఇబ్బందే అయ్యేది. ట్రైలర్ చూశాక ‘కంచె’పై అంచనాలు భారీగా పెరిగాయి. ఓ అద్భుతమైన సినిమాను చూడబోతున్నామన్న ఫీలింగ్ కలిగింది జనాల్లో. తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు అరుదు కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కంచె విడుదలైతే రామ్ సినిమా మీద జనాలు పెద్దగా దృష్టి పెట్టేవాళ్లు కాదు. ఓపెనింగ్స్ మీద కచ్చితంగా ఎఫెక్ట్ ఉండేది. ఇప్పుడు పోటీలో ఉన్న పెద్ద సినిమా వాయిదా పడిపోయింది కాబట్టి.. రామ్ సినిమా కలెక్షన్ల పండగ చేస్కోవచ్చు. కంచె, శివమ్ పోటీలో ఉండటంతో అనుష్క సినిమా ‘సైజ్ జీరో’ కూడా వాయిదా వేసుకున్నారు. మరిప్పుడు యధావిధిగా అక్టోబరు 2కే విడుదల చేస్తారేమో చూడాలి.